కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టిన అరియానా గ్లోరీ

4 Jul, 2021 19:42 IST|Sakshi

బిగ్‌బాస్‌ తర్వాత అరియానా క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఆమె చేసిన వార్తల్లో నిలుస్తోంది. ఇక ముక్కుసూటి తనంతో బిగ్‌బాస్‌ హౌజ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరియానా. యాంకర్‌గా కేరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆమె ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యింది. అదే స్టార్‌డమ్‌తో బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టేంట్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. హౌజ్‌లో బిగ్‌బాస్‌ ఇచ్చిన ప్రతి టాస్క్‌లో పాల్గోంటూ మిగతా కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక అరియానా కేరీర్‌పై దృష్టి పెట్టింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ జాగ్రత్త పడుతోంది.

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే’ నానుడిని ఈ అమ్మడు చక్కగా వినియోగించుకుంటుంది. ఇటూ ఇంటర్వ్యూలు చేస్తూనే సెలబ్రేటీ హోదాను ఎంజాయ్‌ చేస్తున్న అరియాన తాజాగా కొత్త బిజినేస్‌లోకి అడుగు పెట్టింది. తన పేరు మీద ఈవెంట్‌ ప్లానింగ్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేసింది. ‘ఆర్య ఈవెంట్‌ ప్లానింగ్‌’ పేరుతో కొత్త బిజినెస్‌ను ప్రారంభించినట్లు ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఆమె సన్నిహితులు, ఫాలోవర్స్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు