రాహుల్-అషూల లవ్‌ కహానీలో ఎక్స్‌ప్రెస్‌ హరి

18 Jul, 2021 13:45 IST|Sakshi

జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి ఆ తర్వాత బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఇక అదే షోతో పొల్గొన్న రాహుల్‌ సిప్లిగంజ్‌తో బిగ్‌బాస్‌ అనంతరం ప్రేమలో పడ్డట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట పునర్నవితో లవ్‌ ఎఫైర్‌ నడిపిన రాహుల్‌ షో అనంతరం అషూకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని పార్టీలకు వెళ్లడం, ఆ ఫోటోలను షేర్‌ చేయడంతో వీరి మధ్యా ఏదో ఉందనే గాసిప్‌ మొదలైంది. దీనికి తోడు అషూను ఎత్తుకొని ఫోటోకు ఫోజివ్వడం, ఇద్దరూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులకు ప్రేమ సందేశాలు పంపుకోవడం, ఆ వెంటనే రాహుల్‌ లవ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటూ అషూతో ఫోటో షేర్‌ చేయడం వంటివన్నీ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. దీంతో  వీరిదరూ ప్రేమ మైకంలో  మునిగిపోయారని కొందరు నెటిజన్లు పబ్లిక్‌గానే కామెంట్స్‌ చేశారు.


అయితే ఇటీవలె ఓ షోలో పాల్గొన్న అషూ ఎక్స్‌ప్రెస్‌ హరి అనే కమెడియన్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఇది ట్రయాంగిల్‌ లవ్‌ అవుతుందేమోన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అటు హరి సైతం అషూ కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నాడు. దీంతో రాహుల్‌-అషూ మధ్యలో హరి అంటూ మీమ్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన అషూకు ఇదే ప్రశ్న ఎదురైంది.


హరి-రాహుల్‌లలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలంటూ ఫ్యాన్స్ కోరారు. దీంతో 'కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా అని అడిగితే ఏం చెప్పాలంటూ' అషూ ఫన్నీగా బదులిచ్చింది . అంతేకాకుండా ఈ ఇద్దరిలో ఒకరిని తాను ఇష్టపడుతుంటే, మరొకరు తనని ఇష్టపడుతున్నారంటూ చిన్న హింట్‌ కూడా ఇచ్చేసింది. దీంతో మొత్తానికి ఈ లవ్‌కహానీ ట్రయాంగిల్‌ స్టోరీ అని అర్థమయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్‌ హరి తన పేరుపై వేసుకున్న టాటూ గురించి స్పందిస్తూ..అది ఒకషో కోసమని, షోలో చాలా జరుగుతుంటాయని చెప్పింది. దీంతో ఆ టాటూ ఫేక్‌ అని తేలిపోయింది. 
 

మరిన్ని వార్తలు