ఆర్జీవీ OTTలో బిగ్‌బాస్‌ బ్యూటీ దివి మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

9 Jun, 2021 09:47 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-4తో తర్వాత యూత్‌లో బాగా క్రేజ్‌ సంపాదించుకున్న నటి దివి. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ  బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో హౌజ్‌లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తాజాగా  క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది ఈ భామ. కెవిఎన్ రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ఎస్ కృష్ణ నిర్మించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఈ మూవీని థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నారు.

యువ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త సాగ‌ర్ మాచ‌నూరు వ‌ర్మ‌తో క‌లిసి స్పార్క్‌ అనే ఓటీటీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ తన భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ స్పార్క్ ఓటీటీలోనే అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఇప్పటికే ఇందులో వర్మ తెరకెక్కించిన డి చిత్రం విడుదలైంది. తాజాగా దివి లేటెస్ట్‌ మూవీ క్యాబ్‌ స్టోరీస్‌ స్పార్క్‌లో ఈనెల 28నుంచి స్ర్టీమింగ్‌ కానుంది. ఈ మేరకు పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇక ఈ మూవీలో గిరిధ‌ర్, ధ‌న్‌రాజ్, ప్ర‌వీణ్‌,శ్రీహాన్, సిరి కీల‌క పాత్ర‌లు పోషించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు. 

చదవండి : ఐటెం గర్ల్‌ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్‌

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు