Actress Himaja: కొత్త ఇంటికి మారిన హిమజ, హోంటూర్‌ వీడియో వైరల్‌

21 Jul, 2022 13:50 IST|Sakshi

ఈ మధ్య టీవీ, సినీ సెలబ్రెటీలు సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ పెట్టుకుని దాని ద్వారా వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు. వారి ఇల్లు నుంచి రోజు లేవగానే ఏం చేస్తారు, ఏం తింటారు, వారి చీరలు, నగలకు సంబంధించిన ఆసక్తికర వీడియోను పంచుకుంటున్నారు. ఇందులో హోంటూర్‌కు సంబంధించిన వీడియోలపై నెటిజన్లు అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో వారి ఇంటికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ప్రతి సెలబ్రెటీ హోం టూర్‌ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేం, నటి హిమజ తన కొత్త ఇంటికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. అయితే ఇది తన సొంత ఇల్లు కాదనీ, ఇటీవలె మరో ఇంటికి రెంట్‌కు దిగినట్లు తెలిపింది.

చదవండి: మీ టూ నిందితులు వేధిస్తున్నారు: తనుశ్రీ దత్త షాకింగ్‌ పోస్ట్‌

ప్రస్తుతం తాను ఉంటున్న ఇంటిని రెనోవేట్‌ చేయిస్తున్నందున్న కొత్త ఇంటికి మారినట్లు చెప్పింది. తాజాగా ఈ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసి తన ఫాలోవర్స్‌ను పలకరించింది. ఈ సందర్భంగా ఈ కొత్త ఇంటికి సంబంధించిన విశేషాలు, ఇంట్లోని ఫర్నిచర్‌కు వంటి పలు ఆసక్తికర విషయాలను పంచుకుందామె. మరి హిమజ కొత్త ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇదిలా ఉంటే గతంలో తన డ్రీమ్‌ హౌజ్‌ను నిర్మించుకుంటున్నానంటూ హిమజా ఓ వీడియో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. తన సొంత డబ్బులతో నాలుగంతస్తులుగా నిర్మించుకుంటున్న ఆ ఇల్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉందని, ఇందులో మోడ్రన్‌ లిఫ్ట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నానట్లు ఆమె వెల్లడించింది. 

చదవండి: విషాదం.. క్యాన్సర్‌తో టీవీ నటి మృతి

మరిన్ని వార్తలు