భార్యపై కౌశల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. అభిమానుల ఆందోళన

28 May, 2021 15:19 IST|Sakshi

Kaushal Manda: బుల్లితెరపై యాంకర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశల్‌ మండా.. ‘బిగ్‌బాస్‌’షోతో మరింత పాపులారిటీ పెంచుకున్నాడు. బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో విన్నర్‌గా నిలిచి లక్షలాది మంది అభిమాలను సంపాధించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక ‘కౌశల్‌ ఆర్మీ’పేరుతో కొన్ని రోజులు వార్తల్లో కూడా నిలిచాడు. ఆ తర్వాత  కాంట్రవర్సి లను కూడా ఎదుర్కొన్నాడు.  

కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులన్నీ వృథా చేస్తున్నట్లు తనపై ఆరోపణలు కూడా వచ్చాయి. కౌశల్ భార్య నీలిమపై కూడా ఆరోపణలు వ్యక్తం కాగా ఆ సమయంలో కౌశల్ మండా నీలిమ ఆరోగ్యం గురించి ప్రస్తావించారు. తన భార్య ఆరోగ్య సమస్యతో బాధపడుతుందని ఒక సందర్భంగా కౌశల్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా కౌశల్‌ తన భార్య గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 

ఏదో సాధించేందుకు బయల్దేరావు.. ఏదో ఒకటి చేసేందుకు నువ్ నీ జీవితంతో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో అది నువ్ సాధిస్తావ్ అని నాకు తెలుసు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. నువ్వు కన్న కలల కోసం పోరాడిరా.. లవ్యూ.. మిస్ యూ’ అంటూ కౌశల్ భార్యతో కలిసి ఉన్న వీడియోని పోస్ట్‌ చేశాడు. ఇది చూసి కౌశల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అన్నా.. వదినకు ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు.

A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు