మోనాల్‌ ‘బైల్‌ గాడి’ పాట వైరల్‌

5 Jan, 2021 11:24 IST|Sakshi

బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. బిగ్‌బాస్‌ రియాల్టీ షో  నుంచి వచ్చాక ఈ బ్యూటీకి దర్శకనిర్మాతలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.  తాజాగా ఈ బ్యూటీ నటించిన కాగజ్‌ సినిమాలోని ఓ పాట నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ‘బైల్‌ గాడి’అంటూ సాగే ఈ పాటను ప్రవేశ్‌మల్లిక్ సంగీతం అందించగా, ఉదిత్‌ నారాయణ్‌ ఆలపించారు.
 
ఇక కాగజ్‌ సినిమా విషయానికొస్తే.. బతికుండగానే చనిపోయినట్టు  సర్టిఫికెట్‌ ఇచ్చిన  లంచగొండి ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక సామాన్యుడు చేసే పోరాటమే ఈ సినిమా కథ. అజంఘర్‌కు చెందిన భరత్‌ లాల్‌ బిహారీ అనే రైతు జీవిత కథ ఇది. తాను బతికే  ఉన్నానని నిరూపించుకునేందుకు 18 ఏళ్లపాటు న్యాయపోరాటం చేశారు. ఇతర బాలీవుడ్‌ చిత్రాల్లా కాకుండా నాన్‌ గ్లామరస్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రంగా ‘కాగజ్‌’ తెరకెక్కింది. ఈ చిత్రాన్నిసల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా సొంత బేనర్‌లో నిర్మించారు.ఈ బయోగ్రఫికల్‌ డ్రామాకు సతీష్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించారు.  మోనాల్‌ గజ్జర్‌, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలో జీ5 ఓటీటీలో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు