బిగ్‌బాస్‌ ఫేం రొమాంటిక్‌ ఫోటో.. ఎవరతను?

16 Jan, 2021 13:38 IST|Sakshi

ఒవియా హెలెన్‌.. ఇండియన్‌ మోడల్‌ అయిన ఈమె పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే.. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యతగా వచ్చిన తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 1లో ఈ కేరళ కుట్టి పాల్గొంది. బిగ్‌బాస్‌ షోతో ఒవియా కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. ఇందుకు హౌజ్‌లో ఒవియా, ఆరవ్‌ మధ్య నడిచిన ప్రేమాయణమే కారణం. హౌజ్‌లో ఈ జంట చేసిన రొమాన్స్‌ షోకు టాప్ రేటింగ్స్‌ని తీసుకొచ్చింది. అంతే కాదు ఒవియా కోసం అప్పట్లో ఓ ప్రత్యేక ఆర్మీ కూడా ఏర్పాటైంది. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తొలి రోజుల్లోనే ఆరవ్‌తో ఒవియా చాలా సన్నిహితంగా గడిపింది. ఆరవ్‌ను ప్రేమిస్తున్నానంటూ పలుసార్లు తెలిపింది కూడా. అయితే తొలుత ఆమెతో సన్నిహితంగా ఉన్న ఆరవ్‌ ఆ తర్వాత క్రమంగా దూరం పెట్టాడు. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమేనని, అంతుకుమించి తనకు స్పెషల్‌ ఫీలింగ్స్‌ లేవని చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బాస్‌ అనంతరం ఆరవ్‌ తనకు మంచి ప్రెండ్‌ అని,  అంతేగాక  తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నట్టు నటి పేర్కొంది. చదవండి: ‘ఆ చెత్త షోలో పాల్గొనేది లేదు’

తాజాగా ఒవియా తన ట్విటర్‌లో ఓ పోస్టు చేసింది. ఓ వ్యక్తితో రొమాంటిక్‌గా దిగిన ఫోటోను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేయగా.. దీనికి ‘లవ్’‌ అనే క్యాప్షన్‌ను జతచేసింది. ఈ ఫోటోలో ఒవియా అతన్ని కిస్‌ చేస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే సింగిల్‌ అని చెప్పిన ఒవియా ఇలా ఒకరిని కిస్‌ చేస్తున్నట్లు కనిపించడంతో దీనిని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఈ వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అతనెవరనేది తెలుసుకోవాలని చాలా ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ‘ఎవరు అతను ఒవియా.. ఎవరో మాకు చెప్పొచ్చుగా. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు’. అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా  తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 40కి పైగా చిత్రాల్లో ఒవియా నటించారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు