ఆ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ

19 Jul, 2021 09:25 IST|Sakshi

చెన్నై: నటుడు కరుణాస్‌ మళ్లీ కథానాయకుడిగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈయన నటిస్తున్న చిత్రానికి 'ఆధార్‌' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ రిత్విక కథానాయకిగా నటిస్తోంది. పీఎస్‌ రామ్‌నాథ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నిల క్రియేషన్స్‌ పతాకంపై అళగమ్మై మగన్‌ శశికుమార్‌ ఆర్‌యూఎం చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో షూటింగ్‌ కార్యక్రమం ప్రారంభమైన ఈ చిత్రానికి మనోజ్‌ నారాయణన్‌ ఛాయాగ్రహణం, శ్రీకాంత్‌ దేవా సంగీతాన్ని అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు