నటితో బిగ్‌బాస్‌ విన్నర్‌ లిప్‌లాక్‌.. వీడియో వైరల్‌

9 Apr, 2021 17:39 IST|Sakshi

సిద్ధార్థ్ శుక్లా..హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌13తో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న బుల్లితెర నటుడు. షెహ్నాజ్‌తో లవ్‌ ట్రాక్‌ సిద్ధార్థ్‌కు మరింత కలిసొచ్చింది. ఫలితంగా గత సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా మరోసారి సిద్ధార్థ్‌ శుక్లా వార్తల్లోకి ఎక్కాడు. నటి సోనియా రథీతో సిద్ధార్థ్‌ లిప్‌లాక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రీట్వీట్లు చేస్తూ..ఈ వీడియోను షెహ్నాజ్‌కి సైతం ట్యాగ్‌ చేస్తున్నారు. అయితే ఈ లిప్‌లాక్‌ వీడియో రియల్‌ లైఫ్‌లో జరిగింది కాదు. 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే ఓ వెబ్‌సిరీస్‌ కోసం చేసిన యాక్టింగ్‌ మాత్రమే. 


ఈ సిరీస్‌ గత రెండు సీజన్లు విజయవంతం అయిన  సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌ మూడవ సీజన్‌ను ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్‌ ప్రొడ్యూస్‌ చేశారు. ఓటీటీలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌ ఈ మధ్యకాలంలో అత్యంత ప్రజాధణ పొందింది. సిద్ధార్థ్‌- సోనియాలు ఈ రొమాంటిక్‌ వెబ్‌సిరీస్‌లో జంటగా నటించారు. తాజాగా వీరిద్దరి లిప్‌లాక్‌ వీడియో బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌ 'ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అగస్త్యరావుగా నటించిన సిద్ధార్థ్ శుక్లాకు నా అభినందనలు' అంటూ కామెంట్‌ చేశారు. 

చదవండి: అవును.. నేను ఆ సర్జరీ చేయించుకున్నాను: అనుష్క శర్మ
ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొన్న సన్నీలియోన్‌.. ధర ఎంతంటే?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు