Syed Sohel Ryan: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’గా సోహైల్‌

5 Sep, 2021 15:01 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొని తనదైన ఆటతీరుతో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాధించుకున్నడాఉ సోహైల్‌. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకి ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ అని టైటిల్‌ని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం సినిమా టైటిల్‌, హీరో ఫస్ట్‌గ్లిమ్స్‌ని నేచురల్‌ స్టార్‌ నాని సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశాడు. 

 సాధార‌ణంగా అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతుంటారు. ఇందులో మ‌న హీరో సోహైల్ ప్రెగ్నెంట్ కావ‌డ‌మే షాకింగ్ విష‌యం. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేలా టీజ‌ర్‌, పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పుడ‌వి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. శ్రీనివాస్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని వార్తలు