బిగ్‌బాస్ కంటెస్టెంట్ తహసీన్ పూనావాలా త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ గుడ్ న్యూస్‌ను గురువారం అభిమానులతో పంచుకున్నాడీ నటుడు. భార్య మోనికతో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ చేయించుకోగా అందుకు సంబంధించిన ఫోటోలను దంపతులు వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. '2023లో బేబీ పూనావాలా రాబోతున్నాడు' అంటూ తన పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది మోనిక. త్వరలో పేరెంట్స్ కాబోతున్న ఈ జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా తహసీన్ హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లో పాల్గొన్నాడు. అలాగే గతేడాది లాకప్ షోలోనూ పార్టిసిపేట్ చేశాడు.
చదవండి: మోడల్‌తో టైటానిక్ హీరో డిన్నర్ డేట్
ఆ వార్తలు అవాస్తవం: హీరో