మరో కొత్త కారు కొన్న హిమజ, ధర ఎంతంటే!

3 Jun, 2021 17:13 IST|Sakshi

బిగ్‌బాస్‌ బాస్‌ తర్వాత దానిలో పాల్గొన్న వారికి ఒక్కసారిగా స్టార్‌డమ్‌ వచ్చేస్తుంది. అప్పటి వరకు ఎవరికి తెలియని వారంతా బిగ్‌బాస్‌ షోతో అందరి దృష్టి ఆకర్షించి బయటకు రాగానే వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటారు. అంతేగాక పలు ప్రొడక్ట్స్‌, షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్స్‌ అంటు ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీ అయిపోతారు. బిగ్‌బాస్‌కు ముందు సీరియల్స్‌లో నటిస్తూ.. సినిమాల్లో హీరోయిన్స్‌ పక్కన ఫ్రెండ్‌ పాత్రల్లో కనిపించిన నటి హిమజకు బిగ్‌బాస్‌ తర్వాత చాలా గుర్తింపు వచ్చిందని చెప్పుకొవచ్చు. దీంతో ఆమె దీనిని క్యాష్‌ చేసుకుంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను హిమజ చాలా బాగా ఫాలో అవుతుంది.

తనకు వచ్చిన స్టార్‌డమ్‌తో ఇటీవల యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి అందులో సెలబ్రెటీలకు, వంటలకు సంబంధించిన వీడియోలను వరుసగా పోస్టు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు రాగానే కొత్త బంగ్లా కొనుగోలు చేసిన హిమజ ఇటీవల బెంజ్‌ కారు కూడా కొనుక్కుంది. తాజాగా ఆమె మరో కొత్త కారును కూడా కొనుగోలు చేసినట్లు తన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. మహీంద్ర థార్‌ వాహనాన్ని ఖరీదు చేసిన హిమజ దీనికి సంబంధించిన వీడియోను.. ‘మీట్‌ మై తారా’ అంటు షేర్‌ చేసింది. దీంతో ఆమె సహనటీనటులు, అభిమానులు, ఫాలోవర్స్‌ హిమజకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ కారు ధర దాదాపు 13 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. 

A post shared by Himaja💫 (@itshimaja)

మరిన్ని వార్తలు