Bigg Boss Koushal: బిగ్‌బాస్‌ కౌశల్‌పై యండమూరి ప్రశంసలు

2 Feb, 2022 18:44 IST|Sakshi

సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కౌశల్‌ ఈ సినిమాలో చెప్పిన సింగిల్‌ టేక్‌ డైలాగ్‌ టీజర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.

చదవండి: వరుణ్‌ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే..

కౌశల్ చెప్పిన అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్‌ను ఈ రోజు మధ్యహ్నం చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్‌ను కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్‌లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే... ఈ డైలాగ్ ట్రైలర్‌ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు