బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానాకు ‘మెగా’ ఆఫర్‌

4 Mar, 2021 13:00 IST|Sakshi

యాంకర్‌గా కేరీర్‌ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్‌లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్‌ తర్వాత ఫుల్‌ బిజీగా మారింది. యాంక‌ర్‌గా రామ్‌ గోపాల్‌ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. ఇప్పటికే యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌తో కలిసి అరియానా ఓ సినిమాలో నటిస్తుంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్‌ చేసింది. అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే.. అరియానా మరో బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. మెగా హీరో కల్యాణ్ దేవ్ సినిమాలో అరియానా నటిస్తుంది.

శ్రీధర్ సీపన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ దేవ్‌కు చెల్లి పాత్రలో అరియానా కనిపించనుంది. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. నమో వెంకటేశ, దూకుడు సహా పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్ సీపన ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన విజేత సినిమాతో కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘సూపర్ మాచి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 

చదవండి : (బిగ్‌బాస్‌ భామ అరియానకు అరుదైన ఘనత)
(ఆచార్య’ సెట్‌లో సందడి చేయనున్న మెగా కోడలు)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు