లైవ్‌లో రెమ్యూనరేషన్‌ బయట పెట్టిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

26 Apr, 2021 20:34 IST|Sakshi

ప్రస్తుతం మలయాళ బిగ్‌బాస్ షోలో మరింత ఆసక్తికరంగా మారింది. హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ ఒకరిపై ఒకరు వివాస్పద వ్యాఖ్యలు చేసుకుంటు సన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇక నిన్న ఆదివారం జరిగిన ఎపీసోడ్‌లో కంటెస్టెంట్స్‌ కంటెస్టెంట్స్‌ డింపుల్ భాల్, కిడిలమ్ ఫిరోజ్ మధ్య జరిగిన వివాదం చర్చనీయాంశంగా మారింది.  గత వారం కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా హౌజ్‌లో ఫిరోజ్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరకు అతడి తీరుపై హోస్ట్ మోహన్‌లాల్‌కు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టన్సీ టాస్క్‌లో డింపుల్ భాల్‌ను తొటి కంటెస్టెంట్ ఫిరోజ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అంగవైకల్యంతో బాధపడే స్పెషల్ చైల్డ్ అంటూ ఫీరోజ్‌ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తన వైకల్యాన్ని సాకుగా చూపి ఎమెషనల్‌గా అందరి సానుభూతి పొందాలని ఆమె చూస్తోందని, బిగ్‌బాస్‌ కూడా ఆమెకు తేలిక పాటి టాస్కులు ఇస్తున్నారంటూ ఫిరోజ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఫిరోజ్ తీరుపై హోస్ట్ మోహన్ లాల్ మండిపడ్డారు. హద్దు మీరి ప్రవర్తించావంటు అతడిపై ఫైర్‌ అయ్యారు. ఒకవేళ డింపుల్ అతడిని బయటకు పంపించాలనుకొంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ మోహన్ లాల్ పేర్కొన్నారు. దీంతో డింపుల్‌ మధ్యలో కలగచేసుకుని ‘అతడిని కొనసాగనివ్వండి. ఫీరోజ్‌ను క్షమిస్తున్నాను. నాకు మనశాంతి ముఖ్యం’ అంటూ వ్యాఖ్యానించింది. ఇంతలో మరో కంటెస్టెంట్ మణికుట్టన్ మధ్య కలగజేసుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు.

హోస్ట్ మోహన్‌లాల్‌తో మాట్లాడుతూ.. ఇంట్లోని పరిస్థితులు చూస్తుంటే తనకు ఆందోళనగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే అలా కన్నీటీ పర్యంతరం అవుతూనే అతడు మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా తన రెమ్యునరేషన్‌ బయటపెట్టడం అదరిని షాక్‌కు గురిచేసింది. బిగ్‌బాస్ ఇంటిలో ఒకరి జీవితంపై గానీ, వ్యక్తిగత అంశాలపై టార్గెట్ చేస్తే తానే బయటకు వెళ్లిపోతానని, ఒకవేళ తను మధ్య వెళ్లిపోతే తన 50 లక్షల రూపాయల కంటెస్టెంట్‌ రెమ్యునరేషన్‌ను తిరిగివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. కావాలంటే తాను బయటకు వెళ్లి రూ. 50 లక్షల లోన్ తీసుకొని మరి నిర్వహకులకు జరిమానా చెల్లిస్తాను కానీ.. ఇంట్లో ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉండలేనంటూ మణికుట్టన్ చెప్పుకొచ్చాడు.  దీంతో ప్రేక్షకులంతా డింపుల్‌-ఫిరోజ్‌ల వివాదం పక్కన పెట్టి మణికుట్టన్‌ రెమ్యునరేషన్ గురించే చర్చించుకుంటున్నారు.  

చదవండి:
టాలీవుడ్‌లో విషాదం: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి 
పవన్‌ కల్యాణ్‌ నాపై ఏకంగా క‌విత్వం రాశారు: నటి

మరిన్ని వార్తలు