మోహన్‌లాల్‌ పారితోషికం ఎంతో తెలుసా?

8 Feb, 2021 13:49 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ఏ భాషలో అడుగు పెట్టినా విశేష ఆదరణ దాని సొంతం. సెలబ్రిటీలు ఎలా ఉంటారు? వారి జీవితంలో ఏం జరిగింది? అని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రేక్షకులను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ కారణం వల్లే ఎన్నో భారతీయ భాషల్లో బిగ్‌బాస్‌ షో పలు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అటు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అందులో పాల్గొన్న సెలబ్రిటీలకు గుర్తింపు, అవకాశాలను తెచ్చి పెట్టింది.

తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్‌ హాసన్‌, కన్నడలో కిచ్చా సుదీప్‌, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా మలయాళంలో మోహన్‌లాల్‌ హోస్ట్‌గా చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ బిగ్‌బాస్‌ రెండు సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలోనే మూడో సీజన్‌ను ప్రారంభించే పనిలో ఉన్నారు. ఫిబ్రవరి 14 నుంచి సీజన్‌ 3 ప్రసారం కానుందట. ఈ క్రమంలో మోహన్‌లాల్‌ రెమ్యూనరేషన్‌ గురించి పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా చేసేందుకు ఈ సీనియర్‌ నటుడు రూ.12 కోట్లు తీసుకునేవారట. కానీ ఈసారి తన రెమ్యూనరేషన్‌ను మరో ఆరు కోట్లు పెంచినట్లు టాక్‌ వినిపిస్తోంది. అంటే ఈసారి ఏకంగా రూ.18 కోట్లు తీసుకోబోతున్నారన్నమాట. మరి ఈ పారితోషికం ఒక్క ఎపిసోడ్‌కా? ఓవరాల్‌ సీజన్‌కా? అన్నది మాత్రం తెలియరాలేదు. ఇక ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక విషయానికొస్తే.. ఎప్పటిలాగే ఈసారి కూడా టీవీ సెలబ్రిటీలకే పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. ఐశ్వర్య రామ్‌సాయి, నూబిన్‌ జానీ, అనుమోల్‌ ఆర్‌ఎస్‌, శ్రీజిత్‌ విజయ్‌, అనిల్‌ ఆర్‌ మీనన్‌, రాజీవ్‌ పరమేశ్వర్‌, గిలు జోసెఫ్‌, శాంతివిల దినేష్‌ షోలో పాల్గొననున్నట్లు సమాచారం.

చదవండి: రామ్‌గోపాల్‌ వర్మను కలిసిన బోల్డ్‌ బ్యూటీ

అవును.. రిలేషన్‌షిప్‌లో ఉన్నా: నటి

మరిన్ని వార్తలు