ఇల్లు కొనబోతున్న మోనాల్‌‌?!

7 Jan, 2021 20:50 IST|Sakshi

సినిమాలతో రాని గుర్తింపు రియాలిటీ షో బిగ్‌బాస్‌తో సొంతం చేసుకున్నారు  మోనాల్‌ గజ్జర్‌‌. ఓట్లు, గేమ్‌తో కాకుండా లవ్‌ట్రాక్‌తో బిగ్‌బాస్‌లో కొనసాగారు మోనాల్‌. ఎలిమినేషన్‌కు ముందు కొన్ని రోజుల పాటు తనలోని అసలు టాలెంట్‌ని చూపించినప్పటికి.. ఫైనల్‌కి మాత్రం చేరుకోలేకపోయారు. ఇక ఈ సారి బిగ్‌బాస్‌లో‌ పాల్గొన్న వారందరు ప్రస్తుతం టీవీ, సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో మోనాల్‌కి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ నటి మా టీవీలో డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా మొనాల్‌కి సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. (చదవండి: బంపర్‌ ఆఫర్‌‌ అందుకున్న మోనాల్‌.. ‌)

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోల ఆఫర్స్‌తో బిజీగా ఉన్న మోనాల్‌ హైదరాబాద్‌లో ఇల్లు కొనే ఆలోచనలో ఉందట. తనకు ఎంతో గుర్తింపు ఇచ్చిన టాలీవుడ్‌లోనే ఆమె కొనసాగాలునుకుంటున్నట్లు.. ఈ మేరకు సిటీలోనే ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఫిలీంనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు