ఇద్దరం చెంపలు పగలగొట్టుకున్నాం: నందినీ రాయ్‌

18 Jun, 2021 15:00 IST|Sakshi

ఎమోషనల్‌ సీన్లలో నటిస్తే సరిపోదు, జీవించాలి. ఆ సన్నివేశాలు సహజంగా రావడానికి ఎంతో కష్టపడుంటారు నటీనటులు. ఈ క్రమంలో పరిణీతి చోప్రా కూడా తను నటించిన 'సందీప్‌ ఔర్‌ పింకీ పరార్‌' సినిమా కోసం రెండు రోజులు స్నానం చేయలేదు. అనుకోకుండా అబార్షన్‌ జరిగినప్పుడు షాక్‌లో ఉండిపోయిన మహిళగా సహజంగా కనిపించేందుకు ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. తాజాగా నటి నందినీ రాయ్‌ కూడా "ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌" వెబ్‌ సిరీస్‌ కోసం చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నామంటోంది.

"ఈ సినిమాలో నేను, నా సహ నటుడు వికాస్‌ ఒకరినొకరం కొట్టుకోవాలి. ఇది చాలా సహజంగా రావాలన్నది డైరెక్టర్‌ ఆదేశం. మొదట వికాస్‌ నన్ను పైపైన కొట్టినట్లు చేశాడు కానీ అది అంత బాగా రాలేదు. దీంతో తామిద్దం ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చి నిజంగానే చెంపలు వాచిపోయేలా కొట్టుకుందామని ఫిక్సయ్యాం. అప్పుడుగానీ ప్రేక్షకులు మా కన్నీళ్లు నిజమని ఫీలవరు. మేం ప్రతాపం చూపిస్తూ కొట్టుకోవడంతో చెంపలు వాచిపోయాయి. దీంతో దర్శకుడు ఆ వాపు తగ్గేవరకు వేచి చూసి ఆ తర్వాతే మరో సీన్‌ షూట్‌ చేశారు' అని నందినీ చెప్పుకొచ్చింది. 

కాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌" సిరీస్‌లో నందినీ పల్లెటూరి పడుచు పిల్లగా అలరిస్తోంది. నటన మీద ఉన్న ఆసక్తితో ఊరి నుంచి పట్నంకు వెళ్లిన అమ్మాయిలా ఆమె నటన ఆకట్టుకుంటోంది. శుక్రవారం రిలీజైన ఈ సిరీస్‌ ఆహాలో ప్రసారమవుతోంది.

చదవండి: ఆ సీన్‌ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్‌

మరిన్ని వార్తలు