Omakar In Bigg Boss House: హౌస్‌లో అడుగుపెట్టిన ఓంకార్‌

19 Mar, 2022 14:27 IST|Sakshi

Omakar Into Bigg Boss House: ఆనందాలను పంచే రంగుల హోలీ అంటే చిన్నవాళ్ల దగ్గరనుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమే. రంగులు పూసుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ అనుంబంధాలను మరింత ధృడంగా మార్చుకుంటారందరూ. ఇలాంటి హోలీ పండగను జరుపుకునే అవకాశం కంటెస్టెంట్లకు కల్పించాడు బిగ్‌బాస్‌. దీంతో నేటి ఎపిసోడ్‌ కలర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హోలీ వేడుకల్లో అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయాలనే టాస్క్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

అందులో భాగంగా అనిల్‌ బిందుమాధవి మీద పొగడ్తల వర్షం కురిపించగా అనిల్‌ అషూ  చేయి పట్టుకుని స్టెప్పులేశాడు. ఇక హౌస్‌మేట్స్‌కు రెట్టింపు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ రావడం విశేషం. మరి వీరు ఏ రేంజ్‌లో వినోదాన్ని పంచనున్నారో తెలియాలంటే హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: కోట్లు సంపాదించిన మిత్ర శర్మ ఇల్లు చూశారా?

మరిన్ని వార్తలు