Bigg Boss Non Stop: సింహం ఆట కట్‌, నటరాజ్‌ మాస్టర్‌ గుడ్‌బై

14 May, 2022 21:14 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షోలో మరో ఎలిమినేషన్‌ జరగబోతోంది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకు 10 మంది ఎలిమినేట్‌ అయ్యారు. శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి, మహేశ్‌, అజయ్‌, హమీదా, అషూ వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. అయితే షో సగం దాకా వచ్చాక బాబా భాస్కర్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఈమధ్య ఇచ్చిన టాస్క్‌లో ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కూడా గెలుచుకోవడంతో అతడు ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ వారం హౌస్‌మేట్స్‌ అందరూ నామినేషన్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే అఖిల్‌, బిందుకు పోటాపోటీగా ఓట్లు పడుతుండటంతో వీరు సేఫ్‌ జోన్‌లో ఉన్నారు. ఆ తర్వాత బాబా, శివకు సైతం భారీగానే ఓట్లు పడుతున్నాయి, కాబట్టి ఈ వారం వీళ్లు బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ బాబా డేంజర్‌ జోన్‌లో ఉన్నా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ సాయంతో ఈజీగా గండం గట్టెక్కుతాడు. మిత్ర, అరియానా, అనిల్‌కు అంతంతమాత్రంగానే ఓట్లు వస్తున్నాయి. నటరాజ్‌ మాస్టర్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం నటరాజ్‌ మాస్టర్‌ ఇంటినుంచి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం. మొదటి నుంచీ కష్టపడి ఆడుతూ వస్తున్న నటరాజ్‌ మాస్టర్‌ ఈ సీజన్‌లో ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయం అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా నామినేషన్స్‌లో బిందుతో, టాస్క్‌లో అఖిల్‌తో పెట్టుకుని నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. ఫలితంగా అతడు పదకొండో వారంలోనే బిగ్‌బాస్‌ హౌస్‌కు వీడ్కోలు పలకబోతున్నాడు.

చదవండి: ముగ్గురు ఖైదీలు తప్పించుకునేందుకు వేసిన ప్లాన్‌

మరిన్ని వార్తలు