Bigg Boss: ప్రైజ్‌మనీ రూ.25 లక్షలు.. నెలన్నర దాటినా ఇంకా ఇవ్వలేదంటున్న బిగ్‌బాస్‌ విన్నర్‌..

24 Sep, 2023 17:03 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోకి వెళ్తే పేరు ప్రఖ్యాతలే కాదు డబ్బులు కూడా వస్తాయి. అవకాశాల కోసం కొందరు, ఆర్థిక అవసరాల కోసం మరికొందరు ఈ రియాలిటీ షోకి వెళ్తూ ఉంటారు. అన్ని అడ్డంకులు దాటి, ఆటలు ఆడి, ప్రేక్షకుల మనసులు గెలుచుకుని ఒక్కరే విజేతగా నిలుస్తారు. వారికి స్టేజీపైనే ట్రోఫీతో పాటు ప్రైజ్‌మనీ చెక్‌ కూడా ఇస్తారు. అయితే షో పూర్తయి నెల రోజులకు పైనే కావస్తున్నా తనకు ప్రైజ్‌మనీ డబ్బులు ఇవ్వలేదని వాపోయాడు హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ రెండో సీజన్‌ విజేత ఎల్విష్‌ యాదవ్‌.

తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ క్రమంలో అతడి దగ్గర రెండు ఫోన్లు ఉండటం చూసిన నటి, యాంకర్‌ షెహనాజ్‌ గిల్‌.. మూడో ఫోన్‌ ఎప్పుడు కొంటున్నావ్‌? అని అడిగింది. దీనికతడు తన దగ్గర ఇప్పటికే మూడు ఫోన్లు ఉన్నాయన్నాడు. అయితే నాలుగో ఫోన్‌ ఎప్పుడు కొంటావ్‌? అని ప్రశ్నించగా బిగ్‌బాస్‌ టీమ్‌ తన ప్రైజ్‌మనీ రూ.25 లక్షలు ఇచ్చినప్పుడు కొనుక్కుంటానన్నాడు. అతడి సమాధానం విని షాకైన షెహనాజ్‌.. నిజమా? ఇంతవరకు డబ్బులివ్వలేదా? ఇది చాలా తప్పు అని పేర్కొంది. 

కాగా బిగ్‌బాస్‌ ఓటీటీ 2వ సీజన్‌లో ఎల్విష్‌ యాదవ్‌ ఫస్ట్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చాడు. షో ప్రారంభమైన కొన్ని వారాల తర్వాత హౌస్‌లో అడుగుపెట్టినప్పటికీ తన పాపులారిటీతో, ఆటతో అందరి మనసులు గెలుచుకున్నాడు. యూట్యూబర్‌ అభిషేక్‌ మల్హాన్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. ఆగస్టు 14న జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లో ఓటింగే ముగిసే చివరి 15 నిమిషాల్లో ఎల్విష్‌కు ఏకంగా ఏకంగా 28 కోట్ల ఓట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఓటీటీ యాజమాన్యమే తనకు చెప్పిందని ఎ‍ల్విష్‌ వెల్లడించాడు.

A post shared by Elvish Raosahab (@elvish_yadav)

చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి.. దానివల్ల భయంగా ఉందంటూ
బిగ్‌బాస్‌ షోలో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనున్న చార్లీ.. అధికారిక ప్రకటన..

మరిన్ని వార్తలు