బిగ్‌బాస్‌: 'డిప్రెషన్‌లోకి నెట్టారు, ఆత్మహత్యకు ప్రేరేపించారు'

18 Sep, 2021 18:31 IST|Sakshi

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ ముగింపుకు చేరుకుంటోంది. ఇటీవలే హౌస్‌లో నుంచి సింగర్‌ నేహా భాసిన్‌ ఎలిమినేట్‌ అయింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ షోలోని సహ కంటెస్టెంట్లతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూనే టాప్‌ 5లో చోటు దక్కనందుకు బాధపడింది. 'నేను టాప్‌ 5లో లేకపోవడం నన్ను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే ఎలిమినేట్‌ అవుతానన్న ఆలోచనే నాకు లేదు. బిగ్‌బాస్‌ ట్రోఫీ చాలా ముఖ్యం. అలాగే నా ఫ్రెండ్స్‌తో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకున్నా, కానీ ఇలా జరిగింది. ప్రేక్షకులు నా జర్నీ ఇక్కడివరకు మాత్రమే అని నిర్దేశించారు. వాళ్ల నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాను. ఇన్నిరోజుల బిగ్‌బాస్‌ ప్రయాణానికి నా భర్త ఎంతగానో సపోర్ట్‌ ఇచ్చాడు. కేవలం నా కోసమే ఈ షో చూసేవాడు. అదే సమయంలో ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి మా అమ్మ భయపడిపోయింది. కొన్నిసార్లు నా తల్లి, సోదరుడు, భర్తను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేశారు. అది వాళ్లను ఎంతగానో కుంగదీసింది. కానీ ఇలా కావాలని టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కానే కాదు'

'ఇక ఈ సీజన్‌లో ప్రతీక్‌ గెలిస్తే బాగుంటుందనుకుంటున్నాను. అతడు కాకపోతే ఆ తర్వాత షమిత శెట్టి విజేతగా అవతరించాలని ఆశిస్తున్నాను. హౌస్‌లో దివ్య అగర్వాల్‌తో విపరీతమైన గొడవలు జరిగాయి. నన్ను ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. నా కెరీర్‌ మొదట్లోనూ దివ్య లాంటి ఎంతో మంది నా మైండ్‌తో గేమ్స్‌ ఆడారు, నన్ను డిప్రెషన్‌లోకి నెట్టేశారు, ఆత్మహత్యకు ప్రేరేపించారు. ఇలా అంటున్నందుకు దివ్య కుటుంబాన్ని నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ ఆమె చేస్తోంది అదే. నన్ను మాత్రమే కాదు, హౌస్‌లో చాలామందితో ఆమె ఆడుకుంటోంది' అని నేహా భాసిన్‌ చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు