Bigg Boss OTT: ‘బలవంతగా దుస్తులు తొలగించింది, వేడుకున్న వినలేదు’

22 Oct, 2021 14:37 IST|Sakshi

ఓ మహిళ నిర్మాత తనతో అసభ్యంగా ప్రవర్తించిందంటూ బిగ్‌బాస్‌ ఓటీటీ ఫేం, టీవీ నటి ఉర్ఫి జావేద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓ వెబ్‌ సిరీస్‌ సెట్‌లో​ ఎదుర్కొన్న చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. బిగ్‌బాస్‌ ఓటీటీలో పాల్గొన్న ఆమె ఇటీవల ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్‌ మొదట్లో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాననంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాది సంప్రదాయమైన మధ్యతరగతి కుటుంబం. నాకు నటి అవ్వాలనే ఆశ ఉండేది.

చదవండి: అవును..నిజమే..ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నా: నటి

కానీ ప్రతి విషయంలో నాకు కుటుంబ సభ్యులు ఆంక్షలు పెట్టేవారు. అక్కడే ఉంటే నేను నటిని అవ్వాలనే భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత చిన్న ఉద్యోగంలో చేరాను. అప్పుడునెలకు 3 వేల రూపాయల జీతం వచ్చేది. ఆర్థికంగా చాలా కష్టపడ్డాను. ఒక్కోసారి ఖాళీ కడుపుతో పడుకునేదాన్ని. సినిమా అవకాశాల కోసం ఎందరినో కలిశాను. ఆఫర్‌ ఇచ్చినట్టే ఇచ్చి తీరా అక్కడి వెళ్లేసరికి నో అనేవాళ్లు. అలా ఎన్నో సార్లు నిరాశకు గురయ్యాను’ అంటూ చేదు సంఘటనలకు గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో నాకు ఓ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చందని,  కథ నచ్చగానే ఓకే చెప్పి, కాంట్రాక్ట్‌ పేపర్లపై కూడా సంతకం చేసినట్లు తెలిపారు.

చదవండి: ఈషా టాప్‌లెస్‌ ఫొటోపై ట్రోల్స్‌, నెటిజన్లకు హీరోయిన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

అయితే ‘మొదటి రోజు సెట్‌కు వెళ్లగానే నాకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. వెబ్‌ సిరీస్‌ నిర్మాత ఓ మహిళ. సెట్‌ అందరి ముందు ఆమె నాతో అసభ్యంగా ప్రవర్తించింది. షూట్‌ ప్రారంభించగానే నా దుస్తులు తొలగించాలని చెప్పింది. దీంతో నేను ఎందుకు అని ప్రశ్నించాను. కానీ ఆ సీన్‌ స్క్రీప్ట్‌లో లేదు. కానీ నాపై ఇబ్బందికరమైన సన్నివేశాన్ని చీత్రికరించాలని చూశారు. అది నాకు నచ్చలేదు. దీంతో నేను ఈ సీన్‌ చేయనని చెప్పేశాను. అయినా వినకుండ బలవంతంగా నా ఒంటిపై దుస్తులను చింపేసింది. ఎంత వేడుకున్న వినలేదు. పైగా నేను సంతకం చేసిన కాంట్రాక్ట్‌ పేపర్లు చూపించి కోర్టు వెళతానని బెదిరించింది’ అంటూ ఉర్ఫి వాపోయారు. కాగా ఉర్ఫి ‘బాదే భయ్యా కి దుల్యానియా’ సీరియల్‌తో ఉర్ఫి నటిగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మేరీ దుర్గా అనే సీరియల్‌తో నటి మంచి గుర్తింపు పొందారు.

చదవండి: ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’తో ఆ ధైర్యం వచ్చింది: సమంత

మరిన్ని వార్తలు