Bigg Boss Non Stop: మీరు మనుషులేనా? మిత్రను అంతలా హింసిస్తారా?

22 Apr, 2022 14:33 IST|Sakshi

బాబా భాస్కర్‌ ఎంట్రీతో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో మరింత రసవత్తరంగా మారింది. ఆయన వచ్చీరావడంతోనే బిందుమాధవిని సేవ్‌ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా అతడు కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్నాడు. అరియానా, హమీదా, బిందుమాధవి, అజయ్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఏలియన్స్‌ టీమ్‌లో, మిగిలినవారంతా హ్యూమన్స్‌ టీమ్‌లో ఉన్నారు. ఏలియన్స్‌ దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగిలించి పగలగొట్టడం హ్యూమన్స్‌ పనైతే వారి చేతులకు రంగు పూయడం ఏలియన్స్‌ పని. ఈ టాస్క్‌ కోసం రక్తాలు కారేలా ఆడారు హౌస్‌మేట్స్‌.

అమ్మాయిలా, ఆటంబాంబులా అనేలా రెచ్చిపోయారు ఏలియన్స్‌ టీమ్‌ సభ్యులు. అయితే ఈ క్రమంలో వారు గేమ్‌లో శృతి మించిపోయినట్లు కనిపిస్తోంది. హ్యూమన్స్‌ టీమ్‌లోని మిత్ర శర్మను దొరపుచ్చుకుని ఆమె చేతికి రంగు పూయాలని భావించింది ఏలియన్స్‌ టీమ్‌. అనుకున్నదే తడవు పదేపదే ఆమెను టార్గెట్‌ చేస్తూ దాడి చేసింది. ఆమె చేయి పట్టుకుని లాగుతూ, కిందపడేస్తూ నానారచ్చ చేశారు. కిందపడేసినప్పుడు తనకు దెబ్బలు తాకినా ఏమాత్రం పట్టించుకోకుండా బిందు మాధవి ఆమె చేయి పట్టుకుని లాగింది. ఒకరకంగా చెప్పాలంటే హమీదా, అరియానా, బిందు ఆమెను హింసించారు.

దీంతో సోషల్‌ మీడియాలో వీరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆమె చేయి విరగ్గొట్టేలా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర అవస్థను గుర్తించిన బాబా భాస్కర్‌వెంటనే వెళ్లి జుట్టు సరిచేసి చెమట తుడిచి గేమ్‌ పాజ్‌ చేశాడు. అటు అఖిల్‌ ఆమె షర్ట్‌ పైకి పోవడంతో దాన్ని కిందకు సరిచేశాడు. వీళ్లిద్దరూ అంత మానవత్వంతో ప్రవర్తిస్తుంటే ఆ ముగ్గురు మాత్రం మరీ దారుణంగా వ్యవహరించారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. మిత్ర గేమ్‌ ఆడిన విధానం బాగుందని మెచ్చుకుంటున్నారు.

చదవండి: యశ్‌ నుంచి ప్రకాశ్‌ రాజ్‌ దాకా.. కేజీఎఫ్‌ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే?

నన్ను కొట్టింది, నేనూ కొడ్తా: మిత్ర వెనకాల హమీదా పరుగు

మరిన్ని వార్తలు