ఏడుపొస్తోంది రాహుల్‌.. నువ్వు ఎప్పటికీ స్పెషల్‌: అషూ

5 May, 2021 09:49 IST|Sakshi

బిగ్‌బాస్‌ చాలామందికి లైఫ్‌ ఇస్తుందంటారు. కానీ కొందరికి మాత్రం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కేవలం షోలో కనిపించినప్పుడు మాత్రమే పాపులారిటీని తెచ్చిపెడుతుందే తప్ప తర్వాత అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే టాలెంట్‌ ఉన్న చాలామందిని జనాలకు మరింత దగ్గర చేస్తుంది. అలా సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో అడుగు పెట్టి టైటిల్‌ విజేతగా నిలిచాడు.

కానీ హౌస్‌లో 'ఉయ్యాల జంపాల' ఫేమ్‌ పునర్నవి భూపాలంతో లవ్‌ ట్రాక్‌ నడిపాడు. దీంతో వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ షో పూర్తయ్యాక పరిస్థితి తలకిందులైంది. నెమ్మదిగా వీరి మధ్య దూరం పెరిగింది. అనూహ్యంగా రాహుల్‌.. జూనియర్‌ సామ్‌ అషూరెడ్డికి క్లోజ్‌ అయ్యాడు. కలిసి పార్టీలు చేసుకోవడం, ఒకరి కోసం ఇంకొకరు పోస్టులు పెట్టడం చూసి వీళ్లు ప్రేమలో ఉన్నారా? ఏంటి? అని అభిమానులు తలలు గోక్కోవడం మొదలు పెట్టారు. ఈ ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ అషూను ఎత్తుకున్న రాహుల్‌ ఫొటో వైరల్‌ కావడంతో వీరి రిలేషన్‌ ఏంటనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ మాట్లాడుతూ.. అషూ రెడ్డి తనకు చాలా స్పెషల్‌ అని చెప్పుకొచ్చాడు. ఆమె చూపించే కేరింగ్‌ ఇష్టమని పేర్కొన్నాడు. ఆమె తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని స్పష్టం చేశాడు. ఈ మధ్య ఓ సారి డబ్బులు అవసరమై అషూను రూ.10 వేలు అడిగానని, ఆమె క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పంపించిందని చెప్పాడు. కానీ వేరే వాళ్ల దగ్గర ఇలా నిర్మొహమాటంగా అడగలేనని పేర్కొన్నాడు. ఇతడి ఇంటర్వ్యూ చూసిన అషూ ఎమోషనల్‌ అయింది. థాం​క్యూ రాహుల్‌.. నాకు ఏడుపొస్తోంది.. నువ్వు ఎప్పటికీ ఎంతో స్పెషల్‌.. అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.

చదవండి: తొక్కేశారు, రాహుల్‌ కాలికి రక్తస్రావం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు