‘అసలు ఈ ఏడాది బిగ్‌బాస్‌ ఉందా?!’

24 Apr, 2021 16:14 IST|Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో మొదలైందంటే చాలు అభిమానులకు రోజు పండగే. ఇక తెలుగులో బిగ్‌బాస్‌ షోకు సీజన్‌ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. గతేడాది ప్రసారమైన తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఎంతగా ప్రేక్షక ఆదరణ పొందిందో తెలిసిన విషయమే. కరోనా లాక్‌డౌన్‌లో సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఈ షో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చింది. ఆ సీజన్‌లో ఎక్కువగా కొత్త ముఖాలే ఉన్నప్పటికీ నాగార్జున తన అనుభవంతో షోని రక్తి కట్టించడంతో నాల్గో సీజన్‌ విజయవంతంగా ముగిసింది.  

దీంతో బిగ్‌బాస్‌  నిర్వాహకులు ఐదో సీజన్‌ పనులు మొదలెట్టారు. నాల్గో సీజన్‌ ముగిసి నెల రోజులకే స్టార్ మా ఐదో సీజన్‌ కోసం పనులు ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్‌లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన రావడంతో త్వరలోనే బిగ్‌బాస్ 5 సీజన్‌ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏప్రిల్‌లో షో మొదలవుతుందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి మరోసారి దేశం వ్యాప్తంగా కోరలు చాస్తుండటంతో బిగ్‌బాస్‌ ఈ నెలలో మొదలయ్యే అవకాశం లేదని జులై మొదటి వారంలో ఐదో సీజన్‌ని ప్రారంభించబోతున్నట్లు మరోసారి వార్తలు వినిపిం‍చాయి.

ఇక తాజా సమచారం ప్రకారం అసలు బిగ్‌బాస్‌ ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదని వినికిడి. దీంతో అభిమానుల్లో ఈ ఏడాది అసలు షో వస్తుందో లేదో అనే సందేహం మొదలైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ షో ఆలస్యమైన సిజన్‌ 5 ఈ ఏడాది ప్రసారమవడం ఖాయమేనట. అయితే ఈ ఏడాది మాత్రం బిగ్‌బాస్ దసరా తర్వాత మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందట. ఈ సీజన్‌లో స్టార్‌ అట్రాక్షన్‌ను పెంచెందుకు నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే కొందరిని సెలెక్ట్‌ చేసి.. వారికి భారీగా డబ్బులు ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది. గతంలో మాదిరిగా ఈ సారి పార్టిసిపెంట్స్‌ ఎవరన్నది బయటకు రాకుండా షో నిర్వాహకులు లీకు వీరుల నుంచి జాగ్రత్త పడుతున్నారట. ఆలస్యమైన ఈ ఏడాది బిగ్‌బాస్‌ 5 ఉండటం ఖాయమే కానీ అభిమానులు కాస్తా ఎదురు చూడగా తప్పదు.

చదవండి: 
బిగ్‌బాస్ 5 ప్రారంభం అప్పటి నుంచే..
బిగ్‌బాస్‌ తెలుగు 5: పాపులర్‌ సింగర్‌ ఎంట్రీ!

‘బిగ్‌బాస్‌’లోకి టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు