తమిళ బిగ్‌బాస్‌లో శ్రీరెడ్డి!

2 Mar, 2021 17:08 IST|Sakshi

గొడవలకు అడ్డా, కొట్లాటలకు కేరాఫ్‌, పోటీల హోరు, మాటల జోరు, ఎండ్‌లెస్‌ ఎమోషన్స్‌.. ఇవన్నీ పుష్కలంగా లభించేది ఒక్క బిగ్‌బాస్‌ షోలోనే. ఇవి మాత్రమేనా.. స్టార్ల అందచందాలు, వారి హంగామా, ఆటపాటలు, సీక్రెట్లు, రిలేషన్లు, అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి. ఓ పక్క వివాదాల్లో నానుతూనే మరో పక్క వినోదం పంచే బిగ్‌బాస్‌ షోను బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఆరాధిస్తారు.

బిగ్‌బాస్‌ షో తెలుగు, తమిళ భాషల్లో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఐదో సీజన్‌ కోసం కంటెస్టెంట్ల వేట ప్రారంభించారు నిర్వాహకులు. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న తమిళ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ కోసం నిర్వాహకులు ఎవరెవరిని సంప్రదించారన్న లిస్టు ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. కూకూ విత్‌ కోమలి షో కంటెస్టెంట్లు దర్శ్‌ గుప్తా, పవిత్ర లక్ష్మి, శివానీ, అశ్విన్‌తో సంప్రదింపులు జరిపారట. ఇక నాల్గో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా ఇవ్వాల్సిన నటుడు అజీమ్‌ వ్యక్తిగత కారణాల వల్ల హౌస్‌లో అడుగు పెట్టలేదు. దీంతో ఈసారి అతడికి ఛాన్సిద్దాం అనుకుంటున్నారు.

ఈసారి గ్లామర్‌ డోసు పెంచడం కోసం లక్ష్మీ రాయ్‌, పూనమ్‌ భజ్వా, కిరణ్‌ను హౌస్‌లోకి దించాలని చూస్తున్నారట. 'పాండియన్‌ స్టోరీస్‌' ఫేమ్‌ హేమను కూడా షోలో పాల్గొనమని కోరుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. సీనియర్‌ నటి రాధ, హీరో సిద్ధార్థ్‌ను కూడా ఐదో సీజన్‌కు పట్టుకురావాలని చూస్తున్నారట. కానీ వాళ్లు తప్పకుండా ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తారని భావిస్తున్నారు అభిమానులు. టాలీవుడ్‌ సంచలనం శ్రీరెడ్డికి కూడా బిగ్‌బాస్‌ షోలో పాల్గొనమని ఆహ్వానం పంపారట. మరి ఈ ఆఫర్‌కు శ్రీరెడ్డి ఒప్పుకుంటుందా? తిరస్కరిస్తుందా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది.

చదవండి: ఏకధాటిగా 21 గంటలు పని చేశా.. అయినా ఫ్రెష్‌గా ఉన్నా: మోనాల్‌

అండాలు దాచి ఉంచా, పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్‌ భామ

మరిన్ని వార్తలు