Vj Sunny: బిగ్‌బాస్‌ వల్ల ఒరిగిందేమీ లేదు.. షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సన్నీ

10 Sep, 2022 12:14 IST|Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాలిటీ షోకి ఉన్న ‍క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోతో అప్పటిదాకా పెద్దగా గుర్తింపు లేని సెలబ్రిటీలకు కూడా పాపులారిటీ దక్కుతుంది. బిగ్‌బాస్‌ షోతో రాత్రికి రాత్రి స్టార్లు అయిన వాళ్లూ ఉన్నారు. అయితే ఈ క్రేజ్‌ వారి కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడటం లేదనే చెప్పాలి. ఎందుకంటే గత సీజన్లలో విన్నర్స్‌గా బోలెడంత పాపులారిటీని దక్కించుకున్న కంటెస్టెంట్ల జాతకాల్లోనూ పెద్దగా మార్పులు ఉండట్లేదు. ​

తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌-5విజేత వీజే సన్నీ బిగ్‌బాస్‌ షోపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'బిగ్‌బాస్‌ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. బిగ్‌బాస్‌ విన్నర్‌ అని చెప్పుకోవడం కూడా మనేశాను. ఎవరినైనా కలిసినపుడు నేను బిగ్‌బాస్‌ విన్నర్‌ అని చెప్తుంటే అంటే ఏంటి అని అడుగుతున్నారు.

బిగ్‌బాస్‌ షో వల్ల నాకు ఫేమ్‌,నేమ్‌ వచ్చిన మాట నిజమే కానీ నా కెరీర్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో బిగ్‌బాస్‌ విన్నర్‌ అని చెప్పడం మానేసి ప్రస్తుతం నా సినిమాలు, సీరియల్స్‌ మీదే దృష్టి పెడుతున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సన్నీ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.
 

మరిన్ని వార్తలు