Bigg Boss Season 6 Telugu: బిగ్‌బాస్‌-6  ఫైనల్‌ కంటెస్టెంట్లు వీళ్లే.. నో ఛేంజ్‌

3 Sep, 2022 15:35 IST|Sakshi

బుల్లితెరపై బిగ్‏బాస్-6 సందడి మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే హౌజ్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీజన్‌-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచనున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్‌ రియాల్టీ షో రేపు(ఆదివారం)నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే నెట్టింట బిగ్‏బాస్ సందడి షూరు అయ్యింది. ఈసారి షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

వీరిలో 20మంది పేర్లు బయటికి రాగా ఇదే ఫైనల్‌ లిస్ట్‌ అని లీకు వీరులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం..గీతూ రాయల్‌, ఆదిరెడ్డి, సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య, కమెడియన్‌ చంటి,నటుడు బాలాదిత్య, షాన్ని, సింగర్‌ రేవంత్‌, నటి సుదీప(పింకీ), యాంకర్‌ ఆరోహీ రావ్‌, సీరియల్‌ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా(ఆర్జీవీ వీడియోతో పాపులర్‌), లేడీ కమెడియన్‌ ఫైమా, నటి వసంతి, అర్జున్‌, రాజశేఖర్‌, రియల్‌ కపుల్‌ రోహిత్‌, మరీనాలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్‌ కూడా ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు