సల్మాన్‌ ఖాన్‌ ఇంకా ఎదగలేడు: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

10 Jun, 2021 21:20 IST|Sakshi

హిందీ బిగ్‌బాస్‌ షోను ఏళ్లకొద్దీ విజయవంతంగా నడిపించుకొస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌. అక్కడికి వచ్చే ఎంతోమంది కంటెస్టెంట్లు సల్లూభాయ్‌ను కలిసినందుకు తెగ సంతోషపడతారు. అతడితో సెల్ఫీ దిగామని మురిసిపోతుంటారు, సల్మాన్‌ను సూపర్‌ స్టార్‌గా అభివర్ణిస్తారు. కానీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ కంటెస్టెంట్‌ సోఫియా హయత్‌ మాత్రం సల్మాన్‌ను, అతడి సినిమాలను ఏకిపారేసింది. సల్మాన్‌ ప్రేక్షకులకు పనికిరాని కథలను అందించడమేకాక వాటిని సరిగ్గా పండగల సమయంలోనే రిలీజ్‌ చేసి లబ్ధి పొందుతున్నాడని పెదవి విరిచింది.

"సేమ్‌ లుక్‌.. సేమ్‌ స్టోరీ లైన్‌.. హీరోహీరోయిన్‌ కలుసుకోవడం.. అందులోనూ సల్మాన్‌కు యంగ్‌ మోడల్‌ కావాలి తప్ప తన వయసుకు తగ్గ హీరోయిన్‌ను ఇప్పటికీ సెలక్ట్‌ చేసుకోడు. సరిగ్గా పండగ సమయంలోనే సినిమాలు రిలీజ్‌ చేయడం.. ఇవన్నీ చూస్తుంటే అతడు ఇంకా ఎదగలేదనిపిస్తుంది. అదే సమయంలో ఇలాంటి బోరింగ్‌ సినిమాలను తిరస్కరించడంలో ప్రేక్షకులు ఎదిగారని చెప్పవచ్చు. ఏవి అంగీకరించాలి? ఏవి తిరస్కరించాలి? అన్న విషయంలో ప్రేక్షకుడి దృష్టి కోణం మారింది. 

A post shared by Sofia Hayat (@sofiahayat)

రణ్‌దీప్‌ హుడా మంచి నటుడు. అలాంటి వ్యక్తికి రాధే సినిమాలో అస్సలు బాలేని పాత్ర ఇచ్చారు. అతడు ఆ పాత్ర నాకు నచ్చలేదు, నేను చేయలేను అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పిన మరుక్షణం అతడిని బాలీవుడ్‌లో లేకుండా చేస్తారు. ఇండస్ట్రీ అలాంటి స్థితిలో ఉంది. సల్మాన్‌తో వేదిక పంచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే బిగ్‌బాస్‌ ఫైనల్‌లో నేను స్టేజీపైకి రాలేదు. అందుకు నా నైతికత అడ్డొచ్చింది" అని సోఫియా చెప్పుకొచ్చింది.

చదవండి: షారుక్‌, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్‌ రిప్లై ఇదే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు