న‌టిని పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ విన్న‌ర్‌

6 Sep, 2020 16:56 IST|Sakshi

చెన్నై: సినీ, టీవీ సెల‌బ్రిటీల‌కు లాక్‌డౌన్‌ను మించిన మంచి ముహూర్తం లేద‌నుకుంటున్నారో ఏమో కానీ చాలామంది పొలోమ‌ని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా త‌మిళ బిగ్‌బాస్ సీజ‌న్ 1 విన్న‌ర్ ఆరవ్ న‌ఫీజ్ కూడా బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ పెళ్లి పీట‌లెక్కారు. ఆదివారం ఉద‌యం న‌టి రేహి మెడ‌లో మూడు ముళ్లు వేశారు. చెన్నైలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. వీరిలో బిగ్‌బాస్ సీజ‌న్ 1లో పాల్గొన్న స్నేహ‌న్‌, గాయ‌త్రి ర‌ఘురామ్‌, బిందు మాధ‌వి, హార‌తి, హ‌రీశ్ క‌ల్యాణ్‌, సుజా వ‌రుణె ఉన్నారు. వీరితోపాటు ద‌ర్శ‌కులు కెఎస్ ర‌వికుమార్, చ‌ర‌ణ్‌, విజ‌య్‌, రంజిత్ జ‌య‌కోడి కూడా వివాహ కార్య‌క్ర‌మానికి హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ((చ‌ద‌వండి: లాక్‌డౌన్‌ : వినూత్నంగా బిగ్‌బాస్‌ విన్నర్‌ పెళ్లి..)

కాగా ఏడాది కాలంగా ఆర‌వ్‌, రేహీల మ‌ధ్య ప్రేమాయ‌ణం సాగుతోంది. ఎట్ట‌కేల‌కు ఇరు వ‌ర్గాల కుటుంబాల‌ను పెళ్లికి ఒప్పించి వైవాహిక బంధాన్ని మొద‌లు పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆర‌వ్‌కు సినీ సెల‌బ్రిటీల‌తో పాటు ఆయ‌న అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇదిలా వుండ‌గా ఆర‌వ్ హీరోగా న‌టించిన తొలి సినిమా "రాజా భీమా" ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుపుకుంటోంది. రేహి విష‌యానికొస్తే మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు గౌతం మీన‌న్ రూపొందిస్తున్న "జోషువా ఇమాయి పోల్‌ కాకా" అనే రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానునున్నారు. (చ‌ద‌వండి: ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్‌బాస్‌ విన్నర్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా