బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి

5 Oct, 2021 09:06 IST|Sakshi

Bigg Boss Tamil 5 contestant Pavani Reddy: తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌5 మొదలైంది. కోలీవుడ్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ షోను గ్రాండ్‌గా లాంచ్‌ చేశాడు. అక్టోబర్‌ 3న ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే వారిలో మన తెలుగమ్మాయి పావని రెడ్డి సైతం ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో మోడలింగ్‌ చేసిన పావని రెడ్డి తర్వాత  రెట్టా వాల్‌ కురువి సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. చదవండి: భార్యను మూడోసారి పెళ్లి చేసుకున్న హిందీ నటుడు

తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి హిట్‌ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. అయితే ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో తిరిగి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.అక్కడ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. చిన్న తంబి, రసంతి సీరియల్స్‌ ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది.

ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2013లో నటుడు ప్రదీప్‌ కుమార్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే అతను 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరోకరితో చనువుగా ఉన్న ఫోటోను  ప్రొఫైల్‌ ఫోటోగా పెట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగునాట హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి చెన్నైలోనే సెటిల్‌ అయిపోయింది. భర్త చనిపోయిన సుమారు మూడేళ్లకు 2020లో ఆనంద్‌ జాయ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. మొత్తానికి తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌లో పావని రెడ్డి ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. చదవండి: Bigg Boss Tamil 5: బిగ్‌బాస్‌లో పాల్గొన్న 18 మంది కంటెస్టెంట్లు వీళ్లే..


 

మరిన్ని వార్తలు