ఆ సెంటిమెంట్ క‌లిసొస్తే అభిజితే విన్న‌ర్‌?

15 Dec, 2020 18:19 IST|Sakshi

బిగ్‌బాస్ గూటికి చేరాక హీరోలు జీరోలవుతుంటారు, జీరోలు హీరోల‌వుతుంటారు. స్ట్రాంగ్ అనుకున్న‌వాళ్లు మ‌ధ్య‌లోనే ఎలిమినేట్ అవుతారు, ఊహించ‌ని కంటెస్టెంట్లు చివ‌రి వ‌ర‌కూ వెళ్తుంటారు. ఇలా ఎన్నో జంత‌ర్‌మంత‌ర్ మాయ‌లు చోటు చేసుకునే బిగ్‌బాస్ హౌస్‌లో ప్ర‌స్తుతం ఐదుగురు మాత్ర‌మే మిగిలారు. అరియానా, హారిక‌, అభిజిత్‌, సోహైల్‌, అఖిల్.. టైటిల్ కోసం పోటీప‌డుతున్నారు. మ‌రోప‌క్క‌ సోష‌ల్ మీడియాలో మాత్రం అభిజితే విన్న‌ర్ అవుతాడ‌ని బ‌ల‌మైన ప్ర‌చారం జ‌ర‌గుతోంది. దీనికి తోడు 11 సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే ఇదే నిజ‌మ‌య్యే అవ‌కాశమూ లేక‌పోలేదు. ఇంత‌కీ ఈ 11 నెంబ‌ర్ ప్ర‌త్యేక‌త ఏంటేంటే.. ఈ సీజ‌న్‌లో అత‌డు 11 సార్లు నామినేట్ అయ్యాడు.

11 సార్లు నామినేట్‌..
మోనాల్ అత‌డిక‌న్నా ఒక‌సారి ఎక్కువ‌గా అంటే 12 సార్లు నామినేట్ అయిన‌ప్ప‌టికీ ఫినాలే వీక్‌కు ముందే ఎలిమినేట్ అయి రేసు నుంచి త‌ప్పుకుంది. ఆమె విష‌యాన్ని కాస్త‌ ప‌క్క‌న పెడితే ఎక్కువ సార్లు నామినేట్ కావ‌డం అభిజిత్‌కు క‌లిసొచ్చిన‌ట్లు క‌న్పిస్తోంది. ప్ర‌తిసారీ నామినేష‌న్‌లో ఉండ‌టం వ‌ల్ల అత‌డికి ప్రేక్ష‌కుల స‌పోర్ట్ ఎంత‌ ఉంద‌నే విష‌యం అర్థ‌మై ఉంటుంది. ఇక మొద‌టి సీజ‌న్ మిన‌హా రెండో సీజ‌న్‌లో కౌశ‌ల్ మండా కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. గీతా మాధురి త‌న‌కు ల‌భించిన సూప‌ర్ ప‌వ‌ర్‌తో అత‌డిని సీజ‌న్ మొత్తం నామినేట్ చేసింది. అయినా స‌రే ప్ర‌తిసారి ఎక్కువ ఓట్ల‌తో సేవ్ అవుతూ చివ‌రికి విజేత‌గా అవ‌త‌రించాడు. (చ‌ద‌వండి: నీ వ‌ల్ల చాలా హ‌ర్ట్ అవుతున్నా: అభి)

ఎక్కువ సార్లు నామినేట్‌ అయిన‌ రాహుల్
త‌ర్వాత మూడో సీజ‌న్‌లో రాహుల్ సిప్లిగంజ్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. త‌న జిగిరీ దోస్త్ పున‌ర్న‌విని నామినేష‌న్స్ నుంచి సేవ్ చేయ‌డం కోసం సీజ‌న్ మొత్తం త‌న‌ను తాను నామినేట్ చేసుకున్నాడు. అయినా స‌రే ప్రేక్ష‌కుల స‌పోర్ట్‌తో చివ‌రికి ట్రోఫీని ఎగ‌రేసుకుపోయాడు. ఇక ఈసారి కూడా అభిజిత్ 11 సార్లు నామినేష‌న్‌లో ఉండి సేవ్ అవుతూ టాప్ 5లోకి చేరుకున్నాడు. దీంతో మ‌రోసారి 11 సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే అభిజిత్ విజేతగా నిల‌వ‌డం ఖాయం అనిపిస్తోంది. మ‌రి అభిజిత్ ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేసి హిస్ట‌రీ క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబ‌ర్ 20న‌ గ్రాండ్ ఫినాలే‌ కోసం ఎదురు చూడాల్సిందే. (చ‌ద‌వండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి)

>
Poll
Loading...
మరిన్ని వార్తలు