బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్‌!

25 Aug, 2020 14:44 IST|Sakshi

మ‌రి కొన్ని రోజుల్లో బిగ్‌బాస్ సీజ‌న్ 4 సందడి మొద‌ల‌వ‌బోతుంది. ఈమేర‌కు ఏర్పాట్ల‌న్నీ జ‌రిగిపోయాయి. ఇప్ప‌టికే 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంపిక చేసిన మేక‌ర్స్,  వారంద‌రికీ  కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నెగెటివ్ అని నిర్థార‌ణ అయ్యాక‌ ఓ  స్టార్ హోట‌ల్‌లో ఉంచినట్లు తెలుస్తుంది. కింగ్‌ నాగార్జున పుట్టిన రోజైన ఆగస్టు 29 లేదా 30న షో ప్రారంభం కాబోతుందని ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్‌ న్యూస్‌ బిగ్‌బాస్‌ వీక్షకులను కలవర పెడుతోంది. బిగ్‌బాస్‌  సీజన్‌ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌లో ఒకరికి కరోనా వైరస్‌ సోకిందని ఆ వార్త సారాంశం. (చదవండి : బిగ్‌బాస్ 4: ప్రారంభ‌మ‌య్యేది అప్పుడేనా..)

కరోనా వైరస్‌ కారణంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ విషయంలో నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిదే. షోకి ఎంపికైన వారందరికీ ఇప్పటికే కరోనా పరీక్షలు నిర్వహించి, ఓ స్టార్‌హోటల్‌లో క్వారంటైన్‌ చేశారు. అయితే తాజాగా నిర్వహించిన టెస్టుల్లో షోలో పాల్గొనే ఓ సింగర్‌కి పాజిటివ్‌గా నిర్థారణ అయిందట. ప్ర‌స్తుతం ఆ సింగర్‌కి బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ప్ర‌త్యేక చికిత్స అందిస్తున్నార‌ట‌. కాగా షో ప్రారంభం వ‌ర‌కు స‌ద‌రు కంటెస్టెంట్‌కి నెగెటివ్ అని నిర్ధార‌ణ అవుతుందా? లేదా అన్న‌ది మేక‌ర్స్‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంద‌ట‌. ఒకవేళ షో ప్రారంభ సమయానికల్లా ఆయనకు నెగిటివ్‌ రాకపోతే.. అతని స్థానంలో మరోకరిని తీసుకుంటారని సమాచారం.
(చదవండి : బిగ్‌బాస్‌-4: ఈ సారి సరికొత్త వినోదంతో)

మరో వైపు బిగ్‌బాస్‌ సీజన్‌4 ను గతం కంటే డిఫరెంట్‌గా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా ప్లాన్‌ చేశారట మేకర్లు. బుల్లితెరపై పేరుమోసిన యాంకర్లు, ఇతర నటీనటులతో పాటుగా టిక్‌టాక్‌ స్టార్లను కూడా ఈ సారి షోకు ఎంపిక చేశారట. ఈ సీజన్‌లో జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌లు కంటెస్టెంట్‌లుగా ఉండబోతున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా