పాపం..మోనాల్‌ను మ‌ళ్లీ టార్గెట్ చేశారు

17 Oct, 2020 19:41 IST|Sakshi

బిగ్‌బాస్ షో ప్రారంభ‌మై న‌ల‌భై రోజులు అవుతున్నా కొంద‌రు కంటెస్టెంట్ల‌కు మాత్రం అంద‌రితో స‌రైన క‌నెక్ష‌న్లు లేవు. ముఖ్యంగా దివికి, మోనాల్‌కు అస్స‌లు ప‌డదు. లాస్య‌తో కూడా దివికి అంతంత‌మాత్రంగానే ఉంటోంది. అయితే నేటి ఎపిసోడ్‌లో దివి, మోనాల్ వైరం మరోసారి బ‌య‌ట‌ప‌డనున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్ర‌కారం.. దివి మ‌ళ్లీ మోనాల్‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. నీకు చాలా అహంకారం ఉంద‌ని ఎవ‌రు అన్నార‌న్న ప్ర‌శ్న‌కు మోనాల్ వైపు చూసింది. ఆమె న‌టిస్తుంద‌ని చెప్పుకొచ్చింది. దీంతో మోనాల్ స్పందిస్తూ కేవ‌లం త‌న అభిప్రాయం మాత్ర‌మే చెప్పాన‌ని, ఆమె అంటే న‌చ్చ‌లేద‌ని అన‌లేద‌ని తెలిపింది. (చ‌ద‌వండి: గంగ‌వ్వ చాలా సేఫ్‌గా ఉంది)

ఇక ఈ వారం నామినేషన్ ప్ర‌క్రియ‌లో అఖిల్ అభిజిత్‌ను నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు జ‌రిగిన కెప్టెన్సీ టాస్కులో అభిజిత్ సంచాల‌కుడిగా స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నిర‌, ఒక‌రి హ్యాండ్ ట‌చ్ అవుతున్నా దాన్ని ప‌ట్టించుకోలేద‌ని విమర్శించాడు. ఇక ఇదే విష‌యాన్ని ఈరోజు నాగ్ నేటి ఎపిసోడ్‌లో ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మ‌రోసారి అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. అయితే మ‌ధ్య‌లో క‌లుగ‌జేసుకున్న నాగ్ సంచాల‌కుడిదే తుది నిర్ణ‌యం అని స్ప‌ష్టం చేశాడు. త‌ర్వాత అభి, మోనాల్ కూడా గొడ‌వ ప‌డ్డారు. 'నేను అబద్ధాల కోరు అనుకుంటే నాకేం ప్రాబ్ల‌మ్ లేదు అని మోనాల్ చెప్పుకొచ్చింది. కాగా ప్ర‌తివారం అంద‌రూ మోనాల్‌ను టార్గెట్ చేయ‌డం ప‌రిపాటి అయిపోయింది. (చ‌ద‌వండి: మోనాల్‌తో తెగ‌తెంపులు చేసుకున్న అభిజిత్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు