బిగ్‌బాస్‌: కుమార్ సాయి ఎలిమినేట్‌?

18 Oct, 2020 15:43 IST|Sakshi

బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఈ వారం తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. వీరిలో లాస్య‌, హారిక‌, నోయ‌ల్ సేఫ్ అయిన‌ట్లు నాగ్ శ‌నివార‌మే ప్ర‌క‌టించేశారు. ఇంకా అరియానా, అభిజిత్‌, అఖిల్‌, దివి, మోనాల్‌, కుమార్ సాయి నామినేష‌న్‌లో ఉన్నారు. నేడు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంటు పేరును వెల్ల‌డించాల్సి ఉంది. అయితే ఎప్ప‌టిలాగే ఈ వారం ఎవ‌రు హౌస్‌లో నుంచి అడుగు బ‌య‌ట పెట్ట‌నున్నార‌న్న విష‌యం ముందుగానే లీకైంది. కానీ ఇది ప్రేక్ష‌కుల అభిప్రాయానికి కాస్త విరుద్ధంగా ఉండ‌టం గ‌మనార్హం. కుమార్ సాయి బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడ‌న్న వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఆమెపై ఎలిమినేష‌న్ క‌త్తి)

అన్ని పోల్స్‌లో మోనాల్‌దే ఆఖ‌రి స్థానం
అన్ని పోల్స్‌లో మోనాల్ చివ‌రి స్థానం, త‌ర్వాత అరియానా, ఆ త‌ర్వాతే కుమార్ సాయి ఉన్నాడు. దీంతో మోనాల్ బ్యాగు స‌ర్దుకోవ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావిస్తున్న త‌రుణంలో అనూహ్యంగా కుమార్ ఎలిమినేట్ అన్న వార్త విని అంద‌రూ షాక‌వుతున్నారు. బిగ్‌బాస్ నిర్వాహ‌కులు కావాల‌నే మోనాల్‌ను ఎలిమినేష‌న్ గండం నుంచి గ‌ట్టెక్కించార‌ని చెవులు కొరుక్కుంటున్నారు. నిజానికి తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంటు కుమార్ సాయి వెళ్లీ వెళ్ల‌గానే నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో అంద‌రూ చెప్పార‌ని ప‌డ‌వ దిగి అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకున్నాడు. అత‌ను చేసిన ఒక్క త‌ప్పుతో ఇత‌ర కంటెస్టెంట్ల‌కు చుల‌క‌న అయిపోయాడు. దీంతో నామినేష‌న్ వ‌చ్చింద‌న‌గానే మ‌రో ఆలోచ‌నే లేకుండా చాలామంది అత‌డినే వేలెత్తి చూపేవారు.  (చ‌ద‌వండి: అభి, దివికి అహంకారం, మెహ‌బూబ్ వాడుకుంటున్నాడు)

అన్యాయంగా బలైన కుమార్ సాయి
ఈ వారం ప్రారంభంలో హారిక కూడా కుమార్ అతి మంచిత‌నం న‌చ్చ‌లేద‌ని నామినేట్ చేయ‌డం అందుకు పెద్ద సాక్ష్యం. నిద్ర‌పోతాడ‌న్న‌మాటే కానీ ఫిజిక‌ల్ టాస్కులో కుమార్ విజృంభిస్తాడు. టాస్కుకు ఆమ‌డ‌దూరంగా ఉండే చాలామందిక‌న్నా అత‌డు వేయి రెట్లు బెట‌ర్‌. అయినా స‌రే మ‌సాలా కంటెంట్‌ను ఇచ్చే అమ్మాయిని కాపాడేంద‌కు ప్రేక్ష‌కులు ఓట్లు వేసి కాపాడుకున్న కుమార్‌ను అర్ధాంతంర‌గా గెంటేయ‌డం బాధాక‌రం. మ‌రి నేటి ఎపిసోడ్‌లో నిజంగా కుమార్‌నే పంపిస్తారా?  లేక ఏదైనా ట్విస్టు ఉంటుందా? చూద్దాం..

మరిన్ని వార్తలు