'కావాల‌నే మాస్ట‌ర్‌ను సేవ్ చేస్తున్నారు'

17 Oct, 2020 17:18 IST|Sakshi

ఈ వారం ప్రారంభంలో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జ‌రిగింది. అందులో బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌తో ర‌క‌ర‌కాల డీల్స్ కుదుర్చుకున్నాడు. అయితే స‌గం గుండు, సగం మీసం తీసుకోవాల‌న్న డీల్‌కు మాత్రం అంద‌రూ ముఖం తిప్పుకున్నారు. కానీ అమ్మ రాజ‌శేఖ‌ర్ మాత్రం తాను చేస్తానంటూ ముందుకు వ‌చ్చాడు. కానీ అమ్మ చ‌నిపోయిన‌ప్పుడు కూడా గుండు కొట్టించుకోలేద‌ని ఎమోష‌నల్ అయ్యాడు. దీంతో స‌గం గుండు వ‌ల్ల ఒరిగేదేమీ లేద‌ని ఇంటిస‌భ్యులు న‌చ్చ‌జెప్ప‌డంతో ఆయ‌న వెన‌క‌డుగు వేశాడు. కానీ అదే డీల్‌ను నాగార్జున మ‌ళ్లీ తెర‌పైకి తీసుకువ‌చ్చారు. అర‌గుండు, స‌గం మీసం తీసుకుంటే వ‌చ్చే వారం నామినేష‌న్స్ నుంచి సేఫ్ అవుతార‌ని ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఆమెపై వేలాడుతున్న ఎలిమినేష‌న్ క‌త్తి)

దీంతో మళ్లీ మాస్ట‌ర్ ముందుకు వ‌చ్చి తాను చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఒక‌సారి ఆలోచించుకోండ‌ని స‌మ‌యమిచ్చినా కూడా అదే మాట మీద నిల‌బ‌డ్డాడు. దీంతో నోయ‌ల్ అత‌డికి స‌గం గుండు గీకాడు. మాస్ట‌ర్ చేసిన ప‌నికి దివి తెగ ఎమోష‌న‌ల్ అయి బోరుబోరున ఏడ్చేసింది. మాస్ట‌ర్ కూడా క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ గురించి చేయ‌ని త్యాగం ఇప్పుడు చేశార‌ని నాగ్ చ‌ప్ప‌ట్లు కొట్టి అత‌డిని ప్ర‌శంసించారు. అయితే త‌ర్వాతి వారం ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించ‌డానికే మాస్ట‌ర్ కోసం ఈ డీల్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. (చ‌ద‌వండి: సంచాల‌కుడిగా నువ్వు క‌రెక్ట్ కాదు: అవినాష్‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు