అభి, ఆత్మ గౌర‌వం నీకు ఒక్క‌డికే ఉందా?: నాగార్జున ఫైర్‌

7 Nov, 2020 18:02 IST|Sakshi

ఈ వారం ఇంటిస‌భ్యులు చేసిన త‌ప్పొప్పుల‌ను ఎత్తి చూపేందుకు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌ సిద్ధ‌మ‌య్యారు. నాగ్ అక్షింత‌లు వేస్తున్నాడంటే ఆ లిస్టులో త‌ప్ప‌కుండా అభిజిత్ మొద‌టి స్థానంలో ఉంటాడు. ఈ రోజు కూడా నాగ్ అభిజిత్‌ను నిల‌బెట్టి క్లాస్ పీకారు. నామినేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన టీ స్టాండ్ టాస్క్‌లో అభిజిత్ స్వ‌చ్ఛందంగా ప‌క్క‌కు త‌ప్పుకున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఆత్మ గౌర‌వం అంటూ వెళ్లిపోయావు? అంటే మిగ‌త‌వాళ్ల‌కు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అని సూటిగా ప్ర‌శ్నించారు. దీంతో అభి నీళ్లు న‌ములుతూ అంద‌రి గురించి అన్నాను అని స‌మాధానిమిచ్చాడు. ఆత్మ గౌర‌వం పేరిట టాస్కులో నుంచి వైదొల‌గ‌డాన్ని ఎంత‌మంది స‌మ‌ర్థిస్తారు అని నాగ్ ప్ర‌శ్నించ‌గా అంద‌రూ నేల‌చూపులు చూశారు.

నీకు మోనాల్ ఏమ‌వుతుంది?: నాగ్‌
ఇక అమ్మాయిలు బాధ‌ప‌డితే త‌ట్టుకోలేని నాగ్ ఇంట్లో ఏకాకిగా మారిన‌ మోనాల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. త‌న గోడు వెల్ల‌బోసుకునే స‌మ‌యం రావ‌డంతో మోనాల్ తన బాధ‌ను క‌క్కేసింది. అఖిల్ నామినేట్ చేస్తాడ‌ని ఊహించ‌లేదు అని త‌న్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్ర‌య‌త్నం చేసింది. అఖిల్ నా ఫ్యామిలీ అనుకున్నాను అని చెప్పింది. ఆమె మాట‌లు విన్నాక నాగార్జున మోనాల్ నీకు స్నేహితురాలా? అంత‌క‌న్నా ఎక్కువా? అని ప్ర‌శ్నించారు. ఊహించ‌ని ప్ర‌శ్న‌తో అఖిల్ బిక్క‌మొహం వేశాడు. ఇక టీ స్టాండ్ టాస్కులో ఐస్ వాట‌ర్‌ను ముఖానికి కొట్టిన అరియానా తీరును నాగ్ ముందే సోహైల్‌, మోనాల్ త‌ప్పు ప‌ట్టారు. అయితే వాటిని అరియానా కొట్టిపారేసింది. నాకు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు, చేశాను అని సింపుల్‌గా స‌మాధాన‌మిచ్చింది. మ‌రి వీరిలో నాగ్ ఎవ‌రిని స‌పోర్ట్ చేస్తార‌నేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు చూడాల్సిందే. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు కొంద‌రు అరియానాను స‌పోర్ట్ చేస్తుండ‌గా మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.(చ‌ద‌వండి: ఒంట‌రిన‌య్యాను: అరియానా క‌న్నీళ్లు)

టీస్టాండ్ టాస్కులో ఏం జ‌రిగిందంటే..
కాగా టీ స్టాండ్ టాస్కులో అఖిల్‌.. అమ్మ రాజ‌శేఖ‌ర్ ముక్కులో గడ్డిప‌ర‌క‌తో గిలిగింత‌లు పెట్టాడు. ఇది చూసిన అరియానా.. మాస్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి రక్తం కారుతుందేమో, జాగ్ర‌త్త అని అఖిల్ చేస్తున్న దాన్ని పెద్ద త‌ప్పుగా చూపే ప్ర‌య‌త్నం చేసింది. కానీ ఆమె మాత్రం మోనాల్ కాంటాక్స్ లెన్స్ పెట్టుకుంద‌ని తెలిసినా ముఖానికి నీళ్లు విసురుకొడుతూనే ఉంది. ఆమె బాధ‌తో అరుస్తున్నా టాస్కు అంటూ నానార‌కాలుగా టార్చ‌ర్ పెట్టింది. ‌హారిక‌ను కూడా ముఖం మీద నీళ్లు గుమ్మ‌రిస్తూ అక్క‌డున్న వ‌స్తువుల‌తో హింసించింది. అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు స‌పోర్ట్ చేస్తున్నానంటూ వాళ్ల జోలికి కూడా పోలేదు. అయితే అరియానా అరాచ‌కాన్ని చూసి సోహైల్‌కు బీపీ లేచింది. మిగ‌తావాటితో డిస్ట‌ర్బ్ చెయ్ కానీ నీళ్లు ముఖాన కొడుతూ హింసించ‌కు అని నీళ్ల బ‌కెట్‌ను కింద పారేశాడు. ఈ టాస్కులో ఎవ‌రూ ఇమ్యూనిటీ ద‌క్కించుకోలేదు.

Poll
Loading...
మరిన్ని వార్తలు