నాన్న ఇస్త్రీ ప‌ని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్‌: నోయ‌ల్

20 Oct, 2020 15:42 IST|Sakshi

గ‌త‌వారం బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు వారి వ్య‌క్తిగ‌త విషయాల‌ను పంచుకుంటూ కంట‌త‌డి పెట్టారు. ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొని ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చామంటూ ఉద్వేగానికి లోన‌య్యారు. ఇక నోయ‌ల్ వంతు రాగా.. అమ్మ అంద‌రి ఇళ్ల‌ల్లో ప‌ని చేసేద‌ని, నాన్న ర‌క‌ర‌కాల ప‌నులు చేసేవాడ‌ని చెప్పుకొచ్చాడు. ఇస్త్రీ, మేస్త్రీ ప‌ని చేస్తూ డ‌బ్బులు సంపాదించేవాడ‌ని తెలిపాడు. అయితే వికీపీడియాలో నోయ‌ల్ తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అని ఉండ‌టంతో నెటిజ‌న్లు ఫైర్ అయ్యారు. సింప‌థీ ఓట్ల కోసం తండ్రి గురించే అబ‌ద్ధం చెప్తావా? అని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వివాదంపై నోయ‌ల్ త‌మ్ముడు స్పందించారు. (చ‌ద‌వండి: ఫిజిక‌ల్ టాస్కుల‌‌కు దూరంగా అభిజిత్)


ఇస్త్రీ షాపులో ప‌ని చేస్తున్న నోయ‌ల్ తండ్రి

ఆయ‌న మాట్లాడుతూ నోయ‌ల్ చెప్పిన‌దాంట్లో ఏ త‌ప్పూ లేద‌ని స్ప‌ష్టం చేశారు. నిజంగానే నాన్న డిఫెన్స్‌లో చేరేముందు ర‌క‌ర‌కాల ప‌నులు చేశాడ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాల‌ను సైతం బ‌య‌ట‌పెట్టారు. బ‌ట్ట‌లు ఇస్త్రీ చేస్తున్న తండ్రి ఫొటోల‌ను పంచుకున్నారు. డిఫెన్స్ అన‌గానే శాస్త్ర‌వేత్తో, ఆఫీస‌రో అనుకుంటున్నారు. కానీ ఆయ‌న సెక్యూరిటీ గార్డుగా ప‌ని చేసేవార‌ని వెల్ల‌డించారు. ఆ స‌మ‌యంలో కూడా ఆటో న‌డిపేవారని పేర్కొన్నారు. ఇక‌ నోయ‌ల్‌ గురించి చెప్తూ.. "అన్న‌య్య‌ ఇంట‌ర్ త‌ర్వాత చార్మినార్‌లో బుక్ షాపులో ప‌ని చేశాడు, మా వీధిలోనే పాలు పోసేవాడు, వార్తాప‌త్రిక‌లు వేసేవాడు. ఎన్నో క‌ష్టాలు ప‌డి ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చాడు. అన్న‌య్య‌కు పీఆర్ టీమ్ లేదు. నేను మాత్ర‌మే పోస్టులు చేస్తున్నాను. ద‌య‌చేసి అత‌డిపై త‌ప్పుడు ప్ర‌చారం చేయకండి" అని కోరారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అఖిల్‌కు లైనేసిన హారిక‌)

మరిన్ని వార్తలు