Anchor Ravi Birthday: తండ్రికి విషెస్‌ చెప్తూ ఏడ్చేసిన వియా

19 Sep, 2021 20:04 IST|Sakshi

తెలుగు బుల్లితెర మీద దమ్మున్న మేల్‌ యాంకర్లలో రవి ఒకరు. పంచ్‌లతో, కామెడీతో, యాక్టింగ్‌తో అటు అభిమానులు, ఇటు ఆడియన్స్‌ ఇద్దరినీ ఎంటర్‌టైన్‌ చేయడంలో యాంకర్‌ రవి దిట్ట. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై తన ప్రస్థానం కొనసాగిస్తున్న రవి ఈ మధ్యే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో అడుగు పెట్టాడు. ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఆడుతూ అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తున్న అతడి బర్త్‌డే నేడు(సెప్టెంబర్‌ 19).

ఈ సందర్భంగా రవి ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ బయట రచ్చరచ్చ చేశారు. పటాసులు పేలుస్తూ రవికి వినబడేలా గట్టిగా అరుస్తూ బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఈ క్రమంలో రవి కూతురు వియా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ బెలూన్లు గాల్లో వదిలింది. అనంతరం తండ్రిని గుర్తు చేసుకుని ఏడ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోప​క్క యాంకర్‌ రవికి బిగ్‌బాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ పంపిన లెటర్‌, గిఫ్ట్‌ను అతడికి అందించనున్నట్లు సమాచారం. ఇక హౌస్‌లో రవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే!

A post shared by Anchor Ravi (@anchorravi_offl)

మరిన్ని వార్తలు