Anee Master: చిన్నపాపపై ఎందుకింత ద్వేషం? మీకు బుద్ధి లేదా?

22 Nov, 2021 21:05 IST|Sakshi

బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన యానీ మాస్టర్‌ కోపంతో ఊగిపోతోంది. కాజల్‌ విషయంలో తనను నోటికొచ్చినట్లు విమర్శిస్తుండటంతో తట్టుకోలేకపోతోంది. అలాగే తను తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకునే రవి భార్య నిత్యకు సైతం వేధింపులు తప్పట్లేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నవారికి వార్నింగ్‌ ఇస్తూ వీడియోలు పోస్ట్‌ చేసింది.

'బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో జరిగే గొడవలను చూస్తున్నా. మీరు మొదటి నుంచి 11 వారాల వరకు చూడటం లేదా? మీరు ఒకరికి ఫాలోవరే కావచ్చు, అభిమానే కావచ్చు. కానీ ఆ వ్యక్తి ఒకరిని అమ్మేస్తానంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు. అదే నేను డ్యాన్స్‌ చేస్తే మాత్రం చులకన చేస్తున్నానని, అగౌరవపరుస్తున్నానంటూ దాన్ని బాగా హైలైట్‌ చేస్తున్నారు. అంటే.. ఒకరిని అమ్మేస్తానంటూ అగౌరవపర్చడం కాదా? అది మీరు లైట్‌ తీసుకున్నప్పుడు నా డ్యాన్స్‌ మాత్రం ఎందుకింత హైలైట్‌ చేస్తున్నారు?

మరో ముఖ్య విషయమేంటంటే నేను రవి భార్య నిత్యతో మాట్లాడాను. ఆమె కూతురు వియూ వీడియోల కింద బ్యాడ్‌ కామెంట్లు పెడుతున్నారంట! ఐదేళ్ల చిన్న పాపండీ.. ఇది కరెక్ట్‌ కాదు. మేమంటే భరిస్తాం, కానీ చిన్నపిల్లల వీడియోల మీద ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంత ద్వేషం? అసలు నాకు బుద్ధి లేదా? మీకు బుద్ధి లేదా? వియు వీడియోలకు చెడ్డ కామెంట్లు చేయడం ఆపండి' అని హెచ్చరించింది యానీ.

మరిన్ని వార్తలు