Bigg Boss 5 Telugu: యానీ మాస్టర్‌ వెకిలి చేష్టలు, షణ్ను, సన్నీల కొట్లాటలు

13 Nov, 2021 00:13 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 69: బీబీ హోటల్‌ టాస్క్‌లో కాజల్‌ డబ్బులు దొంగిలించిన రవి వాటిని ఆమెకు తిరిగిచ్చేశాడు. మరోవైపు టిప్పు కోసం యానీ సన్నీనెత్తుకుని తిప్పింది. తర్వాత బిగ్‌బాస్‌ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ముగిసిందని ప్రకటించాడు. టాస్క్‌ ముగిసే సమయానికి హోటల్‌ సిబ్బంది దగ్గర రూ.9,500 మాత్రమే ఉన్నాయి. అతిథులు దగ్గర నుంచి 15 వేల రూపాయలు రాబట్టనందున హోటల్‌ సిబ్బంది ఓడిపోయిందని, అతిథుల టీమ్‌ గెలిచిందని ప్రకటించాడు బిగ్‌బాస్‌. ఇక రాత్రిపూట ముచ్చట్లు పెట్టిన రవి, షణ్ను, సిరి.. మానస్‌ ఎక్కువ పని చేస్తాడు కానీ సన్నీ మాత్రం ఏ పనీ చేయడని గుసగుసలాడారు. ఎప్పుడూ తప్పించుకు తిరుగుతాడని అభిప్రాయపడ్డారు.

షణ్ముఖ్‌ ప్రెస్టీజ్‌ చాంపియన్‌ ఆఫ్‌ ది వీక్‌గా ఎంపికై రూ.25,000 గిఫ్ట్‌ వోచర్‌ అందుకోవడం విశేషం. ఇదిలా వుంటే సీక్రెట్‌ టాస్క్‌ విజయవంతంగా పూర్తి చేసిన రవిని కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్‌. అతిథుల టీమ్‌లో నుంచి ఇద్దరిని అనర్హులుగా ప్రకటించాలని హోటల్‌ సిబ్బందిని ఆదేశించగా వారు ఏకాభిప్రాయంతో మానస్‌, పింకీలపై వేటు వేశారు. దీంతో వారు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయారు. మిగిలిన సిరి, కాజల్‌, సన్నీ, రవి కెప్టెన్సీకి పోటీ పడ్డారు. వీరికి 'టవర్‌లో ఉంది పవర్‌' అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో పోటీదారులు టవర్‌ కట్టి అది కూలిపోకుండా చూసుకోవాలి.

మొదటి లెవల్‌లో ఓడిపోయిన కాజల్‌.. రవికి సపోర్ట్‌ చేస్తున్న యానీకి గిలిగింతలు పెట్టింది. దీంతో మండిపోయిన యానీ.. ఓవరాక్షన్‌ చేయకని హెచ్చరించింది. మరోపక్క తనను గేమ్‌ ఆడనీయకుండా అడ్డుకున్న సిరిపై మండిపడ్డాడు సన్నీ. నీ టవర్‌ను తంతానని చెప్పాడు. నన్ను పట్టుకున్నప్పుడు తోసేస్తే అప్పడం అయిపోయేదానివన్నాడు. దీంతో మధ్యలో కలగజేసుకున్న షణ్ను ఏదీ, తన్ను చూద్దామంటూ మరింత రెచ్చగొట్టాడు. అలా వీరిద్దరి మధ్య పెద్ద వారే జరిగింది. సిరి, షణ్ను ఒకరి కోసం ఒకరు సపోర్ట్‌ చేసుకుంటూ ఇద్దరూ కలిసి సన్నీ మీదకు దూసుకెళ్లారు. కళ్లు లేవా? కామన్‌సెన్స్‌ లేదా? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతున్నావ్‌ అని ఎలా అంటావ్‌? అని సిరి సన్నీని ఏకిపారేసింది. సన్నీ కూడా ఆవేశంలో మాటలు తూలాడు కానీ నాగ్‌కు ఇచ్చిన మాట కోసం ఎవరికీ వేలు చూపించలేదు.

ఇక యానీ.. ఈ గేమ్‌లో ఎవరికి సపోర్ట్‌ చేశావని కాజల్‌ను ప్రశ్నించగా ఆమె తెలివిగా సన్నీకి అని కాకుండా రవికి అని చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. అన్ని ఫాల్తూ గేమ్‌ ఆడతావ్‌, నువ్వు గేమ్‌లో నన్ను టచ్‌ చేయొద్దు అని వార్నింగ్‌ ఇచ్చింది. ఒక్క గేమ్‌ నిజాయితీగా ఆడలేదంటూ ఆమె ముందుకెళ్లి నాగిణి డ్యాన్స్‌ చేసింది. ఆమెను వెక్కిరిస్తూ మరింత రెచ్చగొట్టింది. ఇదిలా వుంటే పింకీ చీర తగిలి టవర్‌ కూలిపోవడం సన్నీ గేమ్‌ నుంచి అవుట్‌ అయ్యాడు. అయితే పింకీ కావాలనే టవర్‌ను కూల్చిందని సన్నీ, మానస్‌ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే మోసం చేస్తే ఇంకేం చేయాలని తెగ ఫీలయ్యారు. మొత్తానికి ఈ టవర్‌లో ఉంది పవర్‌ టాస్క్‌లో రవి గెలిచి కెప్టెన్‌గా అవతరించాడు.

మరిన్ని వార్తలు