Bigg Boss 5 Telugu: ఇలాంటి ఫ్రెండ్‌ కావాలి, షణ్నును ఆకాశానికెత్తిన ప్రియ

24 Oct, 2021 23:40 IST|Sakshi

Bigg Boss 5 Telugu, 7th Week Priya Eliminated: కొన్నిసార్లు చిన్నచిన్న పొరపాట్లు కూడా పెద్ద దెబ్బ తీస్తాయి. నటి ప్రియ విషయంలో అదే జరిగింది. ఓటింగ్‌లో టాప్‌లో ఉండే ఆమె ఈ వారం ఎలిమినేట్‌ అవడం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే! కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో సన్నీతో పెట్టుకున్న కయ్యమే ఆమె కొంప ముంచింది. చెంప పగలగొడతానని తిట్టడం, సన్నీని టార్గెట్‌ చేసి రెచ్చగొట్టడం చాలామందికి నచ్చలేదు. అప్పటివరకు ఆమెకు సపోర్ట్‌గా ఉన్నవాళ్లు కూడా ఆమె ప్రవర్తన చూసి సడన్‌గా మిగతావాళ్లకు ఓటేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ గొడవ ఆమె ఎలిమినేషన్‌కు కారణమైంది. ఫలితంగా మరికొద్ది రోజులు హౌస్‌లో కొనసాగేందుకు ఆస్కారం ఉన్న ప్రియ ఏడోవారంలోనే బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చేసింది.

ఇలాంటి ఫ్రెండ్‌ ప్రతి ఒక్కరికీ ఉండాలి
ఎలిమినేషన్‌ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్‌ ఆడించాడు నాగ్‌. హౌస్‌మేట్స్‌కు రిపోర్డ్‌ కార్డ్‌ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కులిచ్చింది. ఎవరూ హర్ట్‌ అవ్వకుండా, నువ్వు హర్ట్‌ కాకుండా గేమ్‌ ఆడంటూ విశ్వకు కూడా 5 మార్కులిచ్చింది. బాగా ఆడుతున్నాడంటూ రవికి 7 మార్కులు వేసింది. షణ్ముఖ్‌కు ఎనిమిదిన్నర మార్కులేస్తూ ఇలాంటి ఫ్రెండ్‌ ప్రతి ఒక్కరికీ ఉండాలంది. షణ్ను వండర్‌ఫుల్‌ పర్సన్‌ అని, అతడు బ్రెయిన్‌తో గేమ్‌ ఆడుతున్నాడని మెచ్చుకుంది.

ఆమెను చూడటంతోనే రోజు స్టార్ట్‌ చేస్తాను: ప్రియ
సిరికి కూడా ఎనిమిదిన్నర మార్కులిచ్చింది. రాత్రి పడుకునేటప్పుడు సిరి త్వరగా తన దగ్గరకు రాదని ఆరోపించింది. శ్రీరామ్‌ తనకు ఎక్కువ కనెక్ట్‌ అవలేదంటూనే 8 మార్కులేసింది. బయటకొచ్చాక పాట నేర్పిస్తానన్న విషయం గుర్తు చేయడంతో అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడో పాట పాడమని కోరాడు నాగ్‌. దీంతో శ్రీరామ్‌.. 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలోని 'నీ చూపులే..' పాటందుకుని అక్కడున్న అందరినీ కొద్ది క్షణాలపాటు మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. తర్వాత ప్రియ.. తనకు ఎంతగానో క్లోజ్‌ అయిన ప్రియాంకకు పదికి 100 మార్కులు ఇచ్చేసింది. పొద్దున లేవగానే పింకీని చూస్తానని, ఆమెను చూడకుండా నిద్ర లేచిన రోజు ఏదో ఒక గొడవ జరుగుతుందని చెప్పుకొచ్చింది.

నా గర్ల్‌ఫ్రెండ్‌కు అలా చెప్పొద్దు: దండం పెట్టిన షణ్ను
జీవితంలో ఎన్నో చూశారు, కానీ అందరినీ నమ్మేస్తారంటూ యానీకి 10, బాగా ఆడుతున్నాడంటూ జెస్సీకి 8 మార్కులేసింది. నీ గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని ప్రియ అడగ్గా ఆ మాట చాలంటూ సంతోషించాడు షణ్ను. అయితే దీప్తిని మర్చిపోయి హాయిగా ఉంటున్నావని ఆమెకు చెప్తానని ప్రియ ఉడికించడంతో వణికిపోయాడు షణ్ను. అలా చెప్పొద్దంటూ దండం పెట్టేశాడు. మా ఇంట్లో కూడా భయపడను, కానీ ఆ అమ్మాయికి భయపడతానన్నాడు.

మానస్‌ బంగారుకొండ, ఆ హక్కు సన్నీకే ఉంది
ముందు బాగా ఆడావు, కానీ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావో, ఏ గేమ్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నావనేది ముందే పసిగడుతున్నాం, అది జరగకుండా చూస్కో అంటూ కాజల్‌కు 7 మార్కులేసింది ప్రియ. మానస్‌.. బంగారుకొండ అంటూ అతడికి 10 మార్క్స్‌ వేసింది. చిన్న వయసులోనే అతడికి చాలా మెచ్యూరిటీ ఉందని మెచ్చుకుంది. చివరగా సన్నీకి 9 మార్కులేస్తూ నా ప్లేటులో తినే రైట్‌, నా కప్పులో తాగే హక్కు నీకు మాత్రమే ఉందని చెప్పి వీడ్కోలు తీసుకుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు