Bigg Boss Telugu 5 Elimination: అయ్యో శ్రీరామచంద్ర! హమీదా వెళ్లిపోయిందా?

9 Oct, 2021 20:39 IST|Sakshi

Bigg Boss 5 Telugu, 5th Week Elimination: బిగ్‌బాస్‌ ఆడే ఆటలో ఏ కంటెస్టెంటు ఎన్ని రోజులు ఉంటాడనేది కచ్చితంగా చెప్పలేము. బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్కులను బట్టి, కంటెస్టెంట్లు ఆడే గేమ్‌ను బట్టి ఏరోజుకారోజు సమీకరణాలు మారిపోతుంటాయి. అందుకే ఎలిమినేషన్‌లోనూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటాయి. ఇక ఈ వారం యాంకర్‌ రవి, షణ్ముఖ్‌ జశ్వంత్‌, మానస్‌, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో హమీదా, విశ్వ, జెస్సీ డేంజర్‌ జోన్‌లో ఉండగా వీళ్లలో నుంచే ఒకరు ఎలిమినేట్‌ అవుతారని ముందునుంచే ప్రచారం జరుగుతోంది. అన్నట్లుగానే ఈ ముగ్గురిలో నుంచి ఒకరు ఎలిమినేట్‌ అయ్యారు. ఐదోవారం హమీదాపై ఎలిమినేషన్‌ వేటు పడినట్లు సోషల్‌ మీడియాలో లీకులు వినిపిస్తున్నాయి.

సూటిగా సుత్తి లేకుండా మాట్లాడటంలో హమీదా దిట్ట. కాకపోతే ఆమె హౌస్‌లో ఎక్కువగా శ్రీరామచంద్రతోనే ఉండటం, మిగతావాళ్లను లెక్కచేయకపోడంతో ఆమెపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ప్రతి చిన్న విషయానికి శ్రీరామ్‌ మీదే ఆధారపడుతోందన్న విమర్శలు కూడా వచ్చాయి.  ఏదేమైనా బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్‌ అవ్వాలని కలలు కన్న హమీదా.. ఆ కల తీరకుండానే బయటకు వచ్చేసిందని విచారం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే లవ్‌ ట్రాకులకు బాగానే ప్రాముఖ్యతనిచ్చే బిగ్‌బాస్‌ హమీదాను ఎలిమినేట్‌ చేయడం ఏంటో అర్థం కావడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు కొందరు నెటిజన్లు. మరి హమీదా నిజంగానే ఎలిమినేట్‌ అయిందా? లేదా? అన్నది క్లారిటీ రావాలంటే రేపటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు