Bigg Boss Telugu 5: హౌస్‌లో అతడే తోపు, నా ఫ్రెండ్‌ జోలికొస్తే అస్సలు బాగోదు.. లోబో

4 Dec, 2021 17:44 IST|Sakshi

Bigg Boss Telugu 5, Lobo Supports Shannu: లోబో.. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ హౌస్‌ బిరుదు అందుకున్నాడీ హైదరాబాదీ. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒకటే సరిపోదని గేమ్‌ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు. అయితే బిగ్‌బాస్‌ మాత్రం లోబోకు ఒక ఛాన్సిద్దామని సీక్రెట్‌ రూమ్‌కు పంపించారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా గేమ్‌లో పెద్దగా ఛేంజ్‌ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఎనిమిదవ వారం అతడిని ఎలిమినేట్‌ చేశారు. 

హౌస్‌లో ఉన్నన్ని రోజులు రవి కోసం గేమ్‌ ఆడాడని, అతడికి కుడిభుజంలా వ్యవహరించాడని లోబో గురించి అంతా అనుకున్నారు. బయటకు వచ్చాక కూడా తన స్నేహితుడు రవికి ఓట్లేయండంటూ అతడికి సపోర్ట్‌ చేస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రవి కూడా షోలో నుంచి నిష్క్రమించడంతో ఇప్పుడు లోబో మరో కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థిస్తున్నాడు. అతడు ఈ వారం ఓటింగ్‌లో లేకపోయినా ఓట్లేయండంటూ వీడియో రిలీజ్‌ చేశాడు.

A post shared by Lobo (@lobo__619)

హౌస్‌లో ఉన్న అందరూ తనకు ఫ్రెండ్సే అని, కానీ షణ్ను అంటే కాస్త ఎక్కువ లవ్‌ అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్‌ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడు. షణ్నును తోపుగా అభివర్ణించిన లోబో అతడికి సపోర్ట్‌ చేసి సూపర్‌ స్టార్‌ను చేద్దామని పిలుపునిచ్చాడు.

మరిన్ని వార్తలు