Bigg Boss 5 Telugu: బుగ్గలు ఖాళీగా ఉన్నాయి, ఇద్దరూ ముద్దివ్వొచ్చుగా.. జెస్సీ వింత కోరిక

4 Nov, 2021 00:13 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 60: పింకీ గురించి అందరి నోటా ఒకటే మాట.. ఆమె మానస్‌ ధ్యాసలో పడి గేమ్‌ ఆడటం లేదని! తాజాగా ఇదే మాటను సన్నీ కూడా అన్నాడు. పింకీ.. నీ జోన్‌లో ఉందని మానస్‌తో చెప్పుకొచ్చాడు సన్నీ. నీ ఆట నువ్వాడని ఆమెకు సలహా ఇచ్చానన్నాడు. దీనిపై మానస్‌ స్పందిస్తూ.. 'ఆమె ఎవరి మాటా వినదు, తాను చేయాలనుకుందే చేస్తుంది. నువ్వు చెప్పినప్పుడు కూడా సరే అన్నయ్య అంటుంది కానీ ఆ వెంటనే పోరా బచ్చాగా అని లైట్‌ తీసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. అయితే పింకీ గేమ్‌ను తాను డిస్టర్బ్‌ చేయడం లేదన్నాడు మానస్‌.

ఇక మెడలు పట్టేసిన జెస్సీ హాయిగా రెస్ట్‌ తీసుకోకుండా ఓవైపు సిరి, మరోవైపు ప్రియాంకను కూర్చోబెట్టుకుని పులిహోర కలపడం మొదలుపెట్టాడు. 'బుగ్గలు రెండు ఒకలా మాసిపోతున్నాయి. ఇద్దరూ కలిపి ఒక ముద్దు పెడితే బాగుంటుంది' అని కోరిక వెలిబుచ్చాడు. ఇది విని షాకైన సిరి కెమెరా నుంచి కాలి వచ్చి తంతుందని సెటైర్‌ వేసింది. ఏంటీ ముద్దులు పెట్టరా? అని మరోసారి అడగ్గా ఇద్దరూ ససేమీరా అనడంతో వాళ్లిద్దరినీ తన బేబీలని చెప్పాడు.

అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్‌. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీములుగా విడిపోయారు. రవి, జెస్సీ, యానీ, విశ్వ, సిరి, సన్నీ నల్ల గులాబీలను ఎంచుకుని సూపర్‌ విలన్స్‌ టీమ్‌గా, ఎర్ర గులాబీలను ఎంచుకున్న మిగిలిన వారంతా సూపర్‌ హీరోస్‌ టీమ్‌గా విడిపోయారు. ఇతర టీమ్‌లోని సభ్యులతో ఐ క్విట్‌ అని చెప్పేలా చేయడమే గేమ్‌. అలా చెప్పించడం కోసం ఏమైనా చేయవచ్చు! 

గేమ్‌ స్టార్ట్‌ అయ్యాక హీరోస్‌ టీమ్‌లోని కాజల్‌ గార్డెన్‌ ఏరియాలో ఉన్న బాక్స్‌ తాళాలన్నీ ఓపెన్‌ చేసింది. ఇది చూసిన విలన్స్‌ టీమ్‌లోని విశ్వ వెంటనే వచ్చి తన టీమ్‌వైపు ఉన్న డోర్‌ తాళాలను తెరిచి హౌస్‌లోకి పరిగెత్తాడు. దీంతో ప్రియాంక అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ విశ్వ మొదటగా స్టోర్‌ రూమ్‌లో అడుగుపెట్టి తాళాలు అక్కడ పెట్టేశాడు. ఈ క్రమంలో తనను నెట్టేశాడని, గట్టిగా పట్టుకున్నారంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. మీరు ఫిజికల్‌ అయితే నేను దాని అమ్మ మొగుడినవుతానని విలన్స్‌ టీమ్‌కు వార్నింగ్‌ ఇచ్చింది.

మొదటి రౌండ్‌లో విలన్స్‌కు ఛాన్స్‌ రాగా వాళ్లు హీరోల టీమ్‌ నుంచి శ్రీరామ్‌ను సెలక్ట్‌ చేశారు. అతడికి పెయింట్‌ నెత్తిన పూసుకోవడం, విచిత్ర జ్యూస్‌లు  తాగడం వంటి టాస్క్‌లిచ్చారు. అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయడంతో హీరోల టీమ్‌కు ఒక పాయింట్‌ లభించినట్లైంది. తర్వాతి రౌండ్‌లో పింకీ తనను తోసిందని సిరి ఆరోపించింది. తనను అందరూ చుట్టుముట్టేస్తే తోయకుండా ఏం చేయాలంది పింకీ. ఈ ఇద్దరి వాదనలు విన్న షణ్ను.. పింకీ, సిరి ఇద్దరిదీ తప్పేనంటూ పెదరాయుడిలా తీర్పునిచ్చాడు.

తర్వాతి రౌండ్‌లో హీరోలు.. విలన్స్‌ టీమ్‌లోని రవిని టార్గెట్‌ చేశారు. రవి తన బట్టలన్నింటికీ పేడ అంటించాలని చెప్పాడు షణ్ను. కానీ జాలేసి కేవలం ధరించిన బట్టలకు మాత్రమే పేడ అంటిస్తే సరిపోతుందన్నారు. తర్వాత అన్ని మిక్స్‌ చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్‌ చేయాలన్నారు. అయితే రవి దేనికీ జంకకుండా, వెనకడుగు వేయకుండా, తన వెన్నునొప్పిని సైతం పక్కనపెట్టి వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు రవి. మరోసారి జ్యూస్‌ ఇవ్వగా దాన్ని కూడా గడగడా తాగేశాడు.

అయితే అతడికి బ్యాక్‌ ప్రాబ్లమ్‌ ఉందని తెలిసినా కూడా అలాంటి కష్టమైన టాస్కులు ఎలా ఇస్తారని ఫైర్‌ అయింది యానీ. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తిరిగి మీకే ఇస్తానని చెప్పింది. అయినప్పటికీ లెక్క చేయని విలన్లు అతడితో గుండ్రంగా తిరగమని చెప్పారు. ఆ వెంటనే మరో జ్యూస్‌ గ్లాస్‌ను సైతం గడగడా తాగాడు. అయినప్పటికీ వారూ మరో డ్రింక్‌ను తాగమని పురమాయించగా అతడు బాగోలేదంటూనే కళ్లు మూసుకుని తాగాడు. తన టీమ్‌ను గెలిపించడం కోసం సాయశక్తులా పోరాడి అందరి మన్ననలు పొందాడు

మరిన్ని వార్తలు