Bigg Boss 5 Telugu: హమీదా ఆశలు అడియాశలు, కెప్టెన్‌గా శ్రీరామ్‌!

30 Sep, 2021 16:49 IST|Sakshi

బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లను వెంటాడే భయం నామినేషన్స్‌. దీని నుంచి తప్పించుకోవడానికి బిగ్‌బాస్‌ ఓ ఆయుధమిచ్చాడు. అదే కెప్టెన్సీ! కెప్టెన్‌ అయిన వ్యక్తి ఒక వారం పాటు నామినేషన్స్‌లోకి రాలేడు. అందుకే ప్రతి కంటెస్టెంట్‌ ఒక్కసారైనా కెప్టెన్‌ అవ్వాలని కలలు కంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఈవారం కెప్టెన్సీకి పోటీపడేవారిని ఎంచుకునేందుకు బిగ్‌బాస్‌ నెగ్గాలంటే తగ్గాల్సిందే అని ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో సన్నీ- మానస్‌, శ్రీరామ్‌-హమీదా, శ్వేత- యానీ మాస్టర్‌ జోడీలు బరువు తగ్గి ముందంజలో ఉన్నాయి. అయితే ఒక్కో జంటలో నుంచి ఒక్కొక్కరు కెప్టెన్సీ కోసం పోటీపడేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆయాజోడీలు ఎవరు వెళ్లాలి? ఎవరు వెళ్లకూడదు అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎలాగో నువ్వు నామినేషన్స్‌లోకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈసారి నేనే కెప్టెన్సీ కోసం పోటీ పడతాను అని హమీదాతో చెప్పుకొచ్చాడు శ్రీరామ్‌. హమీదా, శ్వేత, సన్నీ నిలుచుంటే.. హమీదాకు లేదా శ్వేతకు మాత్రమే సపోర్ట్‌ చేస్తారు, సన్నీకి చేయరు అని చెప్పాడు. అతడు చెప్పిందే కాస్త అటూఇటుగా నిజమైనట్లు తెలుస్తోంది. కాకపోతే హమీదా స్థానంలో శ్రీరామ్‌ బరిలో నిలిచినట్లు భోగట్టా! వీరిలో చాలామంది సన్నీకి సపోర్ట్‌ చేయడానికి వెనకడుగు వేయగా శ్రీరామచంద్ర కెప్టెన్‌గా అవతరించాడని టాక్‌ వినిపిస్తోంది. నిజానికి హమీదా తను కెప్టెన్‌ అయ్యి శ్రీరామ్‌ను రేషన్‌ మేనేజర్‌గా పెడతాననుకుంది. కానీ శ్రీరామ్‌ కెప్టెన్‌గా ఎన్నికై హమీదా రేషన్‌ మేనేజర్‌గా నియమించాడని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు