Bigg Boss 5 Telugu Promo: ఎమోషన్స్‌తో ఆట, వెక్కివెక్కి ఏడ్చిన మానస్‌, సన్నీ!

8 Oct, 2021 19:00 IST|Sakshi

సంతోషం, దుఃఖం, కోపం, వైరం, అలకలు, గిల్లికజ్జాలు, మనస్పర్థలు, పశ్చాత్తాపాలు.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇవన్నీ సర్వసాధారణమే! అయితే పరిస్థితులను బట్టి వాటికి ఎదురీదుతూ ముందుకు వెళ్లాలి, అన్నింటినీ జయించగలగాలి! అప్పుడే గెలుపుకు చేరువయ్యేది! బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లతోనే కాదు, వారి ఎమోషన్స్‌తోనూ ఆటలాడుతాడు. ఇందుకు తార్కాణంగా నిలిచిందీ ప్రోమో. తాజాగా రిలీజైన ప్రోమోలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిన సన్నీ, మానస్‌ స్మోకింగ్‌ రూమ్‌లో వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో లోబో, విశ్వ.. అటు సన్నీని, ఇటు మానస్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు.

'నీకు ఎవరో ఒక్కరే ఇష్టముంటే వేరు.. కానీ అందరూ ఇష్టమైనవాళ్లే అంటే ఎలా డార్లింగ్‌?' అని సన్నీని ఊరడించాడు విశ్వ. ఏదేమైనా వీళ్లిద్దరూ ఇలా ఏడ్చేయడాన్ని చూసి అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. సన్నీ, మానస్‌.. ఇద్దరూ ఫైటర్లే అని, మీరు ఏడిస్తే మాకు బాధగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆటలో జరిగేవాటిని మనసుకు తీసుకోకూడదని హితవు పలుకుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ ఇద్దరి దుఃఖం వెనక గల కారణాలేంటో తెలియాలంటే ఎపిసోడ్‌ కోసం వేచి చూడాల్సిందే!

మరిన్ని వార్తలు