Bigg Boss 5 Telugu: ఇక్కడిదాకా వస్తావనుకోలేదు, టాప్‌ 5లో ఉంటే చాలు.. కాజల్‌ కూతురు

25 Nov, 2021 11:02 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 81: కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ 'నియంత మాటే శాసనం' గేమ్‌లో రవి, షణ్ముఖ్‌, ప్రియాంక మిగిలారు. బజర్‌ మోగగానే మొదటగా సింహాసనమెక్కాడు షణ్ను. దీంతో మిగిలిన ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్‌ చేసే అవకావం అందిపుచ్చుకున్నాడు. దీంతో ప్రియాంక.. ట్రాన్స్‌ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్‌ అవ్వాలని ఉందంటూ తనను గేమ్‌లో నుంచి తొలగించవద్దని కోరింది. అయితే షణ్ను.. తాను రవికి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేకపోయానని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అతడిని సేవ్‌ చేస్తున్నానని నిర్ణయాన్ని ప్రకటించాడు షణ్ను.

తన కమ్యూనిటీ కోసం అయినా పింకీని సేవ్‌ చేయొచ్చుగా అని కాజల్‌ పింకీకి సపోర్ట్‌ చేయడంతో షణ్ను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కమ్యూనిటీ గురించి తీయడం తప్పంటూ హెచ్చరించాడు. నేనేమైనా ఎదవలా కనిపిస్తున్నానా? ఆ పదం ఎందుకు వాడుతున్నారు? అని మండిపడ్డాడు. ఈ గొడవతో తన బుర్ర హీటెక్కిపోయిన ప్రియాంక తన చెంపలు వాయించుకుని వాష్‌రూమ్‌ హాల్‌లోకి వెళ్లి ఏడ్చేసింది. పింకీ బర్త్‌డే కాబట్టి ఆమెను సేవ్‌ చేయాల్సిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఈ గొడవతో షణ్ను సిరిని పట్టుకుని ఏడ్చేశాడు.

ఫైనల్‌గా షణ్ముఖ్‌, రవి కెప్టెన్సీ కంటెండర్లు అవగా శ్రీరామ్‌ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్‌లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచాడు. సిరి అందంగా కనిపించాలంటూ షణ్ను ఆమెకు ముక్కుపుడకిచ్చాడు. తనకు అది పెట్టుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ షణ్ను కోసం దాన్ని ధరించించిది సిరి. అనంతరం బీబీ ఎక్స్‌ప్రెస్‌ అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో చుక్‌ చుక్‌ సౌండ్‌ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లంతా రైలు బోగీలా మారడంతో పాటు రైలులా కదలాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో అందరూ వినోదాన్ని పంచారు.

అందరూ పాజ్‌లో(ఆగిపోయి) ఉన్నప్పుడు కాజల్‌ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చారు. తల్లిని చూడగానే కాజల్‌ కూతురు గుక్కపెట్టి ఏడ్చింది. కాజల్‌ను రిలీజ్‌ అని చెప్పగానే ఆమె తన ఫ్యామిలీని పట్టుకుని ఎమోషనల్‌ అయింది. భర్తపై ముద్దుల వర్షం కురిపించింది. నువ్వు ఇక్కడివరకు వస్తావనుకోలేదని కూతురు అనడంతో కాజల్‌ నవ్వేసింది. కనీసం టాప్‌ 5కి చేరుకున్నా సంతోషమే అని చెప్పింది. 

మమ్మీనెవరైనా నామినేట్‌ చేస్తే కోపమొస్తదా? అని శ్రీరామ్‌ అడగ్గా కాజల్‌ కూతురు అవునని తలూపింది. రవి, శ్రీరామ్‌ను రెండుసార్లు, యానీ మాస్టర్‌నైతే లెక్కలేనన్నిసార్లు తిట్టుకున్నానంది. యానీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయినందుకు సంతోషంగా ఉన్నానంటూనే జస్ట్‌ జోక్‌ చేశానని కవర్‌ చేసింది. ఈ సీన్‌తో షణ్నుకు తన ఫ్యూచర్‌ గురించి టెన్షన్‌ పట్టుకుంది. తనకోసం ఎవరు వస్తారో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. అయ్యా, నమస్కారం, ఎవరిని పంపిస్తున్నారో చెప్తే నేను ముందుగానే ప్రిపేర్‌ అవుతానంటూ కెమెరాకు విన్నవించాడు.

మరిన్ని వార్తలు