Bigg Boss Telugu 5: గేమ్‌ను గేమ్‌లా చూడండి, ఎక్కువ ఎమోషనల్‌ అవద్దు: షణ్ను తల్లి

26 Nov, 2021 20:01 IST|Sakshi

Bigg Boss Telugu 5 Promo, Priyanka and Shanmukh Families In House: ఫ్యామిలీ మెంబర్స్‌ రాకతో కంటెస్టెంట్ల ముఖాలు తారాజువ్వల్లా వెలిగిపోయాయి. అయినవాళ్లను తనివితీరా చూసుకుని సంతోషంలో తేలిపోయారు. గొడవలు, చికాకులు పక్కనపెట్టి కుటుంబసభ్యులతో ఆనంద క్షణాలను ఆస్వాదించారు. ఇప్పటివరకు కాజల్‌, శ్రీరామ్‌, మానస్‌, సిరి, సన్నీ ఫ్యామిలీ మెంబర్స్‌ హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. నేడు రవి, ప్రియాంక, షణ్ముఖ్‌ కుటుంబీకులు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్‌ చేశాడు బిగ్‌బాస్‌.

ప్రియాంక కోసం ఆమె సోదరి రాగా, షణ్ను కోసం ఆమె తల్లి హౌస్‌లో అడుగు పెట్టింది. తల్లిని చూడగానే ఎమోషనల్‌ అయి ఏడ్చేసిన షణ్ను తన కెప్టెన్‌ బ్యాండ్‌ను తల్లి చేతికి కట్టి ఆనందపడ్డాడు. దీపూను కలిసావా? ఎలా ఉందంటూ ప్రేయసి యోగక్షేమాలు ఆరా తీశాడు. దీంతో షణ్ను తల్లి.. వందసార్లు అడగకు, దీపూ బాగానే ఉందని చెప్పింది. ఇంతలో అక్కడికి సిరి రాగా.. గేమ్‌ను గేమ్‌లా చూడండి, ఎక్కువ ఎమోషనల్‌ అయిపోవద్దు అని హెచ్చరించింది. మరోపక్క రవి కూతురు వియా.. బిగ్‌బాస్‌ అంకుల్‌ను చూడాలని పట్టుపట్టింది. బాత్రూంలో కూడా వెతికేసింది. బిగ్‌బాస్‌ అంకుల్‌, ఒక్కసారి చూస్తా, ప్లీజ్‌.. అంటూ క్యూట్‌గా కెమెరాలను అభ్యర్థించింది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు వియా పాప ఎంత ముద్దుగా మాట్లాడిందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు